‘#RC16 ’ మూవీ షూటింగ్ పై తాజా అప్ డేట్.. బుచ్చిబాబు మామూలోడు కాదండోయ్..!

by Dishafeatures1 |
‘#RC16 ’ మూవీ షూటింగ్ పై తాజా అప్ డేట్.. బుచ్చిబాబు మామూలోడు కాదండోయ్..!
X

దిశ, సినిమా: మెగా హీరో రామ్ చరణ్ నటిస్తున్న వరుస చిత్రాల్లో బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘#RC16 ’ మూవీ ఒకటి. ఈ మధ్యనే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ‘మైత్రి’ సంస్థ ఈ చిత్రానికి నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తుంది. అయితే బుధవారం రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలు ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా హైదరాబాద్‌లో శిల్పకళా వేదికలో ఘనంగా జరిగాయి. ఈ కర్యాక్రమానికి టాలీవుడ్‌కి చెందిన బాడా దర్శకులు, నిర్మాతలు హాజరయ్యారు.

ముఖ్యంగా చరణ్ తో సినిమాలు చేయబోతున్న డైరెక్టర్లు, నిర్మాతలు ఈ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు అని చెప్పవచ్చు. ఇందులో భాగంగా.. దర్శకుడు బుచ్చిబాబు మాట్లాడుతూ ‘ హ్యపి బర్త్ డే చరణ్. ఇలాంటి వేడుకలు నువ్వు మరెన్నో జరుపుకోవాలి. మీతో జర్నీ చాలా బాగుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అప్పుడే 3 పాటలు పాటలు కంప్లీట్ అయ్యాయి. ‘ఉప్పెన’ కి దేవి శ్రీ ప్రసాద్ ఎంత మంచి మ్యూజిక్ అందించాడో చెప్పనవసరం లేదు. ఇక ఈ ‘#RC16 ‘ కి రెహమాన్ అంతకు మించి బెస్ట్ సాంగ్స్ ఇచ్చాడు’ అని బుచ్చిబాబు చెప్పుకొచ్చాడు.


Next Story

Most Viewed