Kiara Advani :బాలీవుడ్‌లో తొమ్మిదేళ్ల ప్రయాణం.. కియారా హార్ట్ ఫెల్ట్ నోట్ వైరల్

by Anjali |
Kiara Advani :బాలీవుడ్‌లో తొమ్మిదేళ్ల ప్రయాణం.. కియారా హార్ట్ ఫెల్ట్ నోట్ వైరల్
X

దిశ, సినిమా: బాలీవుడ్‌లో తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతూ హార్ట్ ఫెల్ట్ నోట్ షేర్ చేసింది కియారా అద్వాణీ. 2014లో వచ్చిన ‘పగ్లీ’ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైన ఆమె.. ఇంతకాలంగా తనను ఆదరిస్తున్న అభిమానులు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపింది. ‘ఇప్పుడే నా కెరీర్ ప్రారంభమైనట్లు భావిస్తున్నా. ఈ తొమ్మిదేళ్లలో నాకు మద్దతుగా నిలిచి, ప్రేమగా చూసుకుంటున్నందకు థాంక్స్. మీరు నా వెంట లేకపోతే ఈ ప్రయాణం ఇలా సాగేది కాదు. మీ కుటుంబంలో ఒకరిగా చూస్తున్నందుకు కృతజ్ఞురాలిని. ఎన్నో ఒడిదుడుకులను అధిగమించి, ఈ రోజు ఈ స్థాయిలో నిలబడేలా చేసినందుకు రుణపడి ఉంటా. మరిన్ని కలలను నిజం చేసుకుంటూ ముందుకు సాగాలని కోరుకుంటున్నా. నా పని ద్వారా మీకు వినోదం, ఆనందాన్ని పంచుతాను. నాపైన ఎల్లప్పుడూ మీ ప్రేమ ఉండాలి’ అంటూ రాసుకొచ్చిన నటి.. చివరగా ‘ఐ లవ్ మై జాబ్’ స్టిక్కర్ కూడా యాడ్ చేసింది.

Next Story

Most Viewed