కార్తీ 'విరుమన్' సినిమా డేట్ వచ్చేసింది

by Disha Web |
కార్తీ విరుమన్ సినిమా డేట్ వచ్చేసింది
X

దిశ, సినిమా : కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 'యుగానికి ఒక్కడు' సినిమాతో తన కెరీర్‌ను స్టార్ట్ చేసి.. గతేడాది రిలీజైన 'సుల్తాన్' వరకు ప్రతి సినిమా తెలుగు ప్రజల ఆదరణ పొందింది. అయితే కార్తీ తను తీసిన అతి కొద్ది సినిమాలతోనే టాలీవుడ్ స్టార్ హీరోల రేంజ్‌‌లో అభిమానులను సంపాదించుకున్న సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం కార్తీ.. ఐదు సినిమాలతో బిజీ బిజీగా ఉన్నట్లు సమాచారం. అందులో 'విరుమన్' ఒకటి. కాగా ఈ చిత్రానికి ముత్తయ్య దర్శకత్వం వహిస్తుండగా.. ప్రముఖ దర్శకుడు శంకర్ కూతురు అధితి హీరోయిన్‌‌గా నటించింది. కాగా ఆగస్టు 31న వినాయక చతుర్థి సందర్భంగా సినిమా రిలీజ్ చేసేందుకు మేకర్స్ నిర్ణయించుకున్నారు.

Next Story