లోకనాయకుడు ‘భారతీయుడు-2’ సెకండ్ సాంగ్‌కు ముహూర్తం ఫిక్స్.. ఆడియో లాంచ్ ఎప్పుడంటే?

by Hamsa |
లోకనాయకుడు ‘భారతీయుడు-2’ సెకండ్ సాంగ్‌కు ముహూర్తం ఫిక్స్.. ఆడియో లాంచ్ ఎప్పుడంటే?
X

దిశ, సినిమా: స్టార్ హీరో కమల్ హాసన్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్ధార్థ్ కలిసి నటిస్తున్న సినిమా ‘భారతీయుడు-2’. శంకర్ డైరెక్షన్‌లో 1996లో వచ్చిన భారతీయుడు మూవీకి సీక్వెల్‌గా భారతీయుడు-2 రాబోతుంది. అయితే ఇందులో ప్రియా భవానీ శంకర్, ఎస్‌జే సూర్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ అన్ని ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచాయి.

ఈ క్రమంలో.. తాజాగా, భారతీయుడు-2 నుంచి మేకర్స్ 29న సెకండ్ సాంగ్‌ను విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అలాగే ఈ సినిమా అడియో లాంచ్‌ను జూన్ 1న నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇక ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ ఆనందపడుతున్నారు. కాగా భారతీయుడు-2 జూలై 12న ప్రపంచవ్యాప్తంగా తమిళ, తెలుగు, హిందీ, మలయాళం విడుదల కానున్నట్లు సమాచారం.

Next Story

Most Viewed