అనసూయ-రష్మీ గురించి అసలు విషయాలు చెప్పేసిన జబర్దస్త్ నటుడు!

by Disha Web Desk 6 |
అనసూయ-రష్మీ గురించి అసలు విషయాలు చెప్పేసిన జబర్దస్త్ నటుడు!
X

దిశ, సినిమా: బుల్లితెర జబర్దస్త్ షో ద్వారా ఎంతో మంది నటీనటులు పరిచయం అయ్యారు. ఈ షోలో కామెడీ చేసి అందరినీ అలరించి పలు సినిమాల్లోనూ ఆఫర్లు అందుకున్న వారిలో కిరాక్ ఆర్పీ ఒకరు. ఆయన జబర్దస్త్ షో ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత పలు సినిమాల్లో కమెడియన్‌గా నటించి తన పాపులారిటీ పెంచుకున్నాడు. కానీ కిరాక్ ఆర్పీ పూర్తిగా నటనకు దూరమై నెల్లురులో ఓ రెస్టారెంట్ స్టార్ట్ చేశాడు. ఇప్పుడు అది చూసుకుంటూ డబ్బులు సంపాదిస్తున్నాడు.

ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన పలు విషయాలను వెల్లడించాడు. అలాగే జబర్తస్త్ ద్వారా ఎంతో ఫేమ్ తెచ్చుకున్న బుల్లితెర స్టార్ యాంకర్స్‌ రష్మి, అనసూయ ఎలాంటి వారో కూడా చెప్పుకొచ్చాడు. ఆర్పీ మాట్లాడుతూ.. ‘‘ రష్మి అప్పటి వరకు ఉన్న యాంకర్స్ స్థాయికి మించిన యాంకర్. ఆమెకు తెలుగు సరిగ్గా రాదు. అయినప్పటికీ తనకొచ్చిన బాషలతో స్టార్ డమ్ సంపాదించుకుంది. అప్పట్లో ఆమె తెలుగుకు బదులు తెగులు అన్నా కూడా నేను నవ్వుకునేవాడిని. ఆమె అప్పటి పరిస్థితులు మార్చిన అమ్మాయిగా మారిపోయింది అని అనుకుంటున్నా’’ అని చెప్పాడు. ఇక అనసూయ గురించి చెబుతూ.. యాంకర్‌గానే కాకుండా సినిమాల్లోనూ ఆమె నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ప్రత్యేకమైన క్యారెక్టర్స్‌తో తన స్థాయిని మరింత పెంచుకుంది. యాంకరింగ్ కంటే ఎక్కువగా సినిమాలు బాగా సెట్ అయ్యాయి అనిపిస్తుంది’’ అని తెలిపాడు.

Read More..

వద్దన్న వినేవాడు కాదు.. తన తండ్రి గురించి వైరల్ కామెంట్స్ చేసిన సాయి పల్లవి..

Next Story

Most Viewed