జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్‌కు షాకిచ్చిన భార్య జోర్దార్ సుజాత.. అసలు ఏం జరిగిందంటే?

by Disha Web Desk 6 |
జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్‌కు షాకిచ్చిన భార్య జోర్దార్ సుజాత.. అసలు ఏం జరిగిందంటే?
X

దిశ, సినిమా: బుల్లితెర నటి సుజాత మొదట యాంకర్‌గా పరిచయం అయింది. ఆ తర్వాత జోర్దార్ సుజాతగా మంచి ఫాలోయింగ్‌ను తెచ్చుకుంది. ఇక యాంకరింగ్‌లో కొద్ది కాలంపాటు చేసిన ఆమె.. జబర్దస్త్ షోలో పలు స్కిట్స్ చేసి ప్రేక్షకులను అలరించింది. ఈ క్రమంలోనేజబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక అప్పటి నుంచి వెకేషన్స్‌కు వెళ్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే ఓ యూట్యూబ్ చానల్ పెట్టి అందులో వ్లాగ్స్ తీస్తూ నెట్టింట షేర్ చేస్తున్నారు. తాజాగా, సుజాత సమ్మర్‌కు సంబంధించి ఓ మినీ వ్లాగ్ చేసింది.

ఇందులో.. ఎండాకాలం కదా దుబాయ్‌కి వెళ్దామా అని భర్తను అడుగుతుంది. దానికి రాకేష్ పక్కనే కేబుల్ బ్రిడ్జి పోదాం అంటాడు. వెంటనే ప్యారిస్ అయినా పోదామా అని అడిగితే.. షాపింగ్ మాల్ పోదాం అని చెప్తాడు. దీంతో విసుగు చెందిన సుజాత పని చేసుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే సుజాతని రాకేష్ తలనొప్పిగా ఉంది కాఫీ తీసుకుని రావా అని అడుగుతాడు. దీంతో పిచ్చి కోపంలో ఉన్న సుజాత పక్కనే కదా కాఫీ షాప్ ఉంది అక్కడికి వెళ్లి తాగండి అంటుంది. ఇక సుజాత సమాధానం విన్న రాకేష్ షాక్‌కు గురవుతూ అలాగే చూస్తూ ఉండిపోతాడు. అయితే ఇదంతా వ్లాగ్ కోసం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో అది చూసిన వారంతా సుజాత రాకేష్‌కు భలే షాకిచ్చిందని ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.


Next Story

Most Viewed