కమల్ హాసన్ ‘ఇండియన్-2’ సినిమాలో మనీషా కొయిరాలా..!

by Hamsa |
కమల్ హాసన్ ‘ఇండియన్-2’ సినిమాలో మనీషా కొయిరాలా..!
X

దిశ, సినిమా: లోకనాయకుడు కమల్ హాసన్, శంకర్ డైరెక్షన్‌లో వచ్చిన మూవీ ఇండియన్. ఇందులో మనీషా కొయిరాలా కీలక పాత్రలో కనిపించింది. ఈ మూవీ 1996 లో రిలీజ్ అయి సంచలన విజయం సాధించింది. అయితే ఈ చిత్రానికి సీక్వెల్‌గా ఇండియన్-2 రాబోతున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన పోస్టర్స్, సాంగ్ మూవీపై భారీ హైప్‌ను క్రియేట్ చేశాయి. ఇందులో కమల్ హాసన్, సిద్ధార్థ, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియాభవాని నటిస్తున్నాడు. అయితే ఈ మూవీ జూన్ 12న విడుదల కాబోతుంది.

ఈ క్రమంలో.. ఇండియన్-2కు సంబంధించిన ఓ వార్త తెరపైకి వచ్చింది. ఇందులో మనీషా కోయిరాలా కూడా ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని మేకర్స్ రహస్యంగా ఉంచడం విశేషం. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌లో మనీషా కోయిరాలా కూడా ఉన్నట్లు నెటిజన్లు పట్టేశారు. ఇండియన్-2లో ఆమె కూడా నటిస్తున్నట్లు నెట్టింట పలు చర్చలు మొదలయ్యాయి. ఇందులో మనీషా కోయిరాలా ఎలాంటి పాత్ర చేస్తుందనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 53 ఏళ్ల వయసున్నఆమె ఇండియన్-2లో ఏలా కనిపించనుందో చూడాలని సినీ ప్రియులు అతృతగా ఎదురుచూస్తున్నారు. కానీ, ఈ మూవీలో ఆమె నటిస్తున్నట్లు ఎలాంటి పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేయలేదు.

Next Story

Most Viewed