నటి హేమ బెంగళూరు రేవ్ పార్టీకి వెళ్లిందా.. బయటపడ్డ సంచలన ఆధారం.. షాక్‌లో నెటిజన్లు!

by Hamsa |
నటి హేమ బెంగళూరు రేవ్ పార్టీకి వెళ్లిందా.. బయటపడ్డ సంచలన ఆధారం.. షాక్‌లో నెటిజన్లు!
X

దిశ, సినిమా: రెండు మూడు రోజుల నుంచి బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అయితే ఇందులో పలువురు సినీ సెలబ్రిటీలు ఉన్నట్లు బెంగళూరు పోలిసులు నిర్ధారించారు. ఈ రేవ్ పార్టీలో టాలీవుడ్ నటి హేమ కూడా ఉన్నట్లు పోలీసులు బ్లడ్ శాంపిల్స్ సేకరించి డ్రగ్స్ తీసుకున్నారా? లేదా అని టెస్ట్ చేయగా తీసుకున్నట్లు కన్ఫర్మ్ అయింది. అలాగే ఆమె తన పేరును కృష్ణవేణిగా చెప్పుకుందని అసలు నిజాలు బయట పెట్టారు.

అంతేకాకుండా ఆమెకు నోటీసులు పంపించారు. దీనిపై హేమ స్పందించి తాను రేవ్ పార్టీకి వెళ్లలేదని ఏం చేసుకుంటారో చేసుకోండి భయపడేది లేదు అని షాకింగ్ కామెంట్స్ చేసింది. దీంతో ఈ విషయం తెలిసిన వారంతా అసలు ఆమె రేవ్ పార్టీకి వెళ్లిందా లేదా అని అయోమయంలో పడిపోయారు.

తాజాగా, హేమ బెంగళూరు రేవ్ పార్టీకి వెళ్లినట్లు ఓ ప్రూఫ్ బయటకు వచ్చింది. మే 18న ఆమె హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్లిన ఫ్లైట్ టికెట్ కాపీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో హేమ శనివారం మధ్యాహ్నం 1.55 గంటలకు శంషాబాద్ నుంచి బెంగుళూరుకు వెళ్లినట్లు ఉంది. దీంతో ఈ విషయం తెలిసిన వారు షాక్ అవుతున్నారు. అలాగే ఓ కూతురు మంచి ఫ్యామిలీ ఉండి ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నావంటూ ఏకిపారేస్తున్నారు. అయితే ఆ ఫ్లైట్ టికెట్ ఆమెదా కాదా అనేది తెలియనప్పటికీ అందులో హేమ పేరు ఉండటంతో అవి కాస్త నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Next Story

Most Viewed