అయోధ్య రాముడికి సూర్య తిలకం.. ఈ ఐడియా రాజమౌళిదేనా?

by Disha Web Desk 8 |
అయోధ్య రాముడికి సూర్య తిలకం.. ఈ ఐడియా రాజమౌళిదేనా?
X

దిశ, సినిమా : శ్రీరామ నవమి రోజు అయోధ్యలో అద్భుత ఘట్టం చోటు చేసుకుంది. బాల రామయ్య నుదిటిని సూర్యభగవానుడు ముద్దాడాడు. టెక్నాలజీని ఉపయోగించి అయోధ్య రాముల వారి నుదిటి మీద సూర్య తిలకాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం శ్రీరామ నవమి రోజున బాలరాముడికి సూర్యాభిషేకం చేయనున్నట్లు పండితులు తెలిపారు.

ఈ క్రమంలోనే ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. క్రియేటివ్ డైరెక్టర్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన సినిమాల్లో తన కాన్సెప్ట్‌తో అందరినీ ఆకట్టుకుంటారు. అయితే బాల రాముడికి సూర్య తిలకం కాన్సెప్ట్ కూడా రాజమౌళికి ఎప్పుడో వచ్చిందంట. అది ఎప్పుడో తెలుసుకుందాం.. అయితే తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఏపీ సపరేట్ అయిపోయింది. అప్పుడు ఏపీ మొదటి సీఎం చంద్రబాబు నాయుడు. అయితే ఆయన అమరావతిని రాజధానిగా నిర్మించే క్రమంలో రాజమౌళిని పిలిపించి, దాని డిజైన్స్ ఎలా ఉంటే బాగుంటుందో అడిగి తెలుసుకున్నాడు. ఆ క్రమంలోనే జక్కన్న.. అసెంబ్లీ భవనం, మన సంస్కృతి, చరిత్ర గురించి చెబుతూ.. ఓ సూపర్ ఐడియా చెప్పారు. అంతేకాకుండా టెక్నాలజీ సహాయంతో తెలుగు తల్లిపై సూర్యకిరణాలు పడేలా డిజైన్ చేసిన వీడియో ప్రెజెంట్ చేశారు. ప్రతి రోజూ ఉదయం 9.15 గంటలకు అసెంబ్లీ సెంట్రల్ హాల్ లో ఉన్న తెలుగు తల్లి విగ్రహం పాదాలను తాకేలా డిజైన్ చేశారు. ఆ తర్వాత ఆ సూర్య కిరణాలు తెలుగు తల్లి ముఖంపై పడే విధంగా చేసి ఆ సమయంలో మా తెలుగు తల్లికి మల్లెపువ్వు దండ అనే సాంగ్ వచ్చేలా ఉన్న వీడియోను ఆయన ప్రజెంట్ చేశారు. ఇది చాలా బాగుంది. సీఎంకు కూడా ఎక్కువగా నచ్చింది. కానీ దీనిని ఇంప్లిమెంట్ చేయలేకపోయారు. అయితే ఇప్పుడు ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయోధ్యలో బాలరాముని సూర్య తిలకం ఐడియా రాజమౌళికి ఎప్పుడో వచ్చిందంటూ కామెంట్స్ చేస్తున్నారు కొందరు

Next Story

Most Viewed