ఆస్కార్ విన్నర్ అరెస్ట్.. Iranలో కొనసాగుతున్న Hijab వివాదం

by Disha Web Desk 10 |
ఆస్కార్ విన్నర్ అరెస్ట్.. Iranలో కొనసాగుతున్న Hijab వివాదం
X

దిశ, సినిమా : ఇరాన్‌ స్టార్ యాక్ట్రెస్, ఆస్కార్ విన్నర్ తరనేహ్ అలిదూస్తి చిక్కుల్లో పడింది. ఇరాన్‌లో హిజాబ్ ధరించకపోవడం కారణంగా 'మహసా అమిని' అనే అమ్మాయిని పోలీసులు హింసించగా చనిపోయిన విషయం తెలిసిందే. ఇందుకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో.. ఇందుకు మద్దతు తెలిపిన నిరసనకారుడు మోహసేన్ షెకారిని మోర్టాలిటీ పోలీసులు అరెస్ట్ చేసి, ఉరి తీశారు. కాగా ఈ చర్యను బహిరంగంగా విమర్శించిన తరనేహ్... 'అన్ని అంతర్జాతీయ సంస్థలు ఈ రక్తపాతాన్ని కళ్లారా చూస్తూ కూడా చర్యలు తీసుకోకపోడం మానవాళికి అవమానకరం' అంటూ సోషల్ మీడియా పోస్ట్ పెట్టింది. దీంతో ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఇస్లామిక్ రిపబ్లిక్ గవర్నమెంట్ ఆమె వాదనలకు ఆధారాలు లేకపోవడం కారణంగా అదుపులోకి తీసుకుందని పలు న్యూస్ ఏజెన్సీలు వార్తలు ప్రచురించాయి.

READ MORE

న్యూడ్ సీన్స్ చేయడం ఇష్టమే కానీ.. పార్ట్స్‌పై కామెంట్స్ నచ్చవు

Next Story

Most Viewed