అతడిని రామన్న యూతే లీడర్‌ని చేసిందా..? (వీడియో)

by Disha Web Desk |
అతడిని రామన్న యూతే లీడర్‌ని చేసిందా..? (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: మనం చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉంటాం.. ఏవైన ప్రోగ్రామ్స్ చేసినా, గేమ్స్ ఆడినా, గల్లీలో గణేష్ పెట్టినా ఆ బ్యాచ్ యూతంతా కామన్‌గా ఏదో ఒక యూత్ పేరు పెట్టుకుంటారు. అలా వాళ్ళు పెట్టుకున్న పేరే రామన్న యూత్. లీడర్ అవ్వాలన్న కలతో ‘రామన్న యూత్’ ఎలాంటి పనులు చేసింది.. ఒకే ఫ్లెక్సీలో సంవత్సరంలో వచ్చే ఎన్ని పండుగల పేర్లు కొట్టించారు.. వాళ్ళు అసలు ఆ బ్యాచ్‌కి రామన్న యూత్ పేరు ఎందుకు పెట్టుకున్నారో తెలియాలంటే సెప్టెంబర్ 15న రిలీజయ్యే ‘రామన్న యూత్’ సినిమాని చూడాల్సిందే. ఈ సినిమాలో ‘పెళ్లి చూపులు’ మూవీలో కమిడియన్‌గా పరిచయమైన అభయ్ నవీన్ మొదటి సారి యాక్టర్ నుంచి డైరెక్టర్‌గా మారారు. ఇటీవల ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మాస్ కా దాస్ విశ్వక్ సేన్, బలగం హీరో ప్రియదర్శి, మసూద, పరేషాన్ సినిమాల హీరో తిరువీర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సినిమా గురించిన మరిన్ని విషయాలు ‘రామన్న యూత్’ దిశకు ఇచ్చిన పూర్తి ఇంటర్వ్యూలో చూడండి.



Next Story

Most Viewed