రవితేజ ఇచ్చిన ఆ కాంప్లిమెంట్ ఎప్పటికీ మరిచిపోను: త్రినాథరావు

by Dishanational2 |
రవితేజ ఇచ్చిన ఆ కాంప్లిమెంట్ ఎప్పటికీ మరిచిపోను: త్రినాథరావు
X

దిశ, సినిమా: రవితేజ, శ్రీలీల జంటగా తెరకెక్కిన మూవీ 'ధమాకా'. యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌‌గా త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన ఈ చిత్రం డిసెంబర్ 23న విడుదల కానుంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన డైరెక్టర్.. రచయిత ప్రసన్నతో తనకు మంచి బాండింగ్ ఉందని చెప్పాడు. తమ ఇద్దరికీ బాగా సింక్ అయిందని, త్వరలో ప్రసన్న గొప్ప దర్శకుడు కాబోతున్నాడంటూ ప్రశంసలు కురిపించాడు. అలాగే విశ్వప్రసాద్, వివేక్ చాలా కంఫర్ట్ బుల్ నిర్మాతలని, ఎక్కడా రాజీ పడకుండా సినిమాను నిర్మించారని తెలిపాడు. చివరగా రవితేజ ఇచ్చిన కాంప్లిమెంట్ ఎప్పటికీ మరిపోనన్న ఆయన.. 'రవి నన్ను బెస్ట్ ఆడియన్ అంటాడు. ఆడియన్ ఏదైతే ఎంజాయ్ చేస్తాడో డైరెక్టర్‌గా అది నువ్వు ఎంజాయ్ చేస్తుంటావు. అందుకే నీకెప్పుడూ సక్సెస్ వుంటుంది' అని మెచ్చుకున్నట్లు చెప్పాడు.

Next Story

Most Viewed