నేను ఎవరినీ అడుక్కోలేదు.. సామ్ షాకింగ్ కామెంట్స్

by Vinod kumar |
నేను ఎవరినీ అడుక్కోలేదు.. సామ్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: స్టార్ నటి సమంత రెమ్యూనరేషన్‌పై షాకింగ్ కామెంట్స్ చేసింది. నిజానికి తానెప్పుడు ఇంత కావాలని ఎవరినీ అడుక్కోలేదని, ఇతరులతో సమానంగా కూడా ఇవ్వాలని పోరాడలేదని తాజా ఇంటర్య్వూలో చెప్పుకొచ్చింది. ‘నేను పారితోషికం కోసం ఎప్పుడూ డైరెక్ట్‌గా పోరాడలేదు. అలాగని మొత్తం పట్టించుకోకుండా లేను. కష్టాన్ని చూసి రెమ్యూనరేషన్ ఇవ్వాలని కోరుకుంటాను. మా పని చూసి ‘మేము మీకు ఇంత ఇవ్వాలనుకుంటున్నాం’ అని మేకర్స్ చెప్పాలి.

అంతేకానీ మేము మాకు ఇంత కావాలని యాచించాల్సిన అవసరం లేదు. ఏదైనా మన కృషి ఫలితంగానే వస్తుందని బలంగా నమ్ముతాను. ఈ క్రమంలో ఎప్పటికప్పుడూ మన సామర్థ్యాన్ని, ప్రతిభను మెరుగుపరుచకుంటూ ముందుకెళ్లాలి’ అని సూచించింది. అలాగే ప్రేమ అంటే ఆడ, మగ మధ్య మాత్రమే ఉండదని.. స్నేహితుల మధ్య కూడా ప్రేమానురాగాలు ఉంటాయన్న సామ్.. ఒక రిలేషన్ కోల్పోయినంత మాత్రాన జీవితం అంతా అయిపోయినట్లే కాదని అంటోంది.

ఇవి కూడా చదవండి :

రెండో పెళ్లి చేసుకోబోతున్న నాగచైతన్య.. పెళ్లికూతురు ఆమేనంట?

మంచు ఫ్యామిలీ గొడవలపై స్పందించిన భూమ అఖిలప్రియ

Next Story