నా దగ్గర ఒక సీక్రెట్ ఉంది.. ఆ విషయాన్ని త్వరలోనే చెప్పేస్తానంటున్న శ్రుతి హాసన్?

by Prasanna |
నా దగ్గర ఒక సీక్రెట్ ఉంది.. ఆ విషయాన్ని త్వరలోనే చెప్పేస్తానంటున్న శ్రుతి హాసన్?
X

దిశ,వెబ్ డెస్క్: శ్రుతి హాసన్ ప్రస్తుతం తన ప్రియుడితో కలిసి ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. శంతనుతో కలిసి డ్యాన్సులు వేస్తూ ఉంది.. వర్కౌట్లు చేస్తోంది. వీళ్లను చూస్తుంటే.. ప్రేమలో మునిగి తేలుతున్నట్లు తెలుస్తుంది. కానీ వీళ్లకు అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందో ?లేదో? తెలియడం లేదు. పలు ఇంటర్వూస్ లో శృతి హాసన్ ను పెళ్లి గురించి అడగగా.. ఆ ప్రశ్నకు ఇంత వరకు స్పందించలేదు. ఎందుకంటే .. ఈ ముద్దుగుమ్మకు ఇప్పటికే చాలా బ్రేక్ అప్స్ అయ్యాయి. దానిని దృష్టిలో పెట్టుకుని పెళ్లి విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది.

తాజాగా శ్రుతి హాసన్ తన ఇన్ స్టా స్టోరీలో ఓ పోస్ట్ వేసింది. దాన్ని బట్టి చూస్తే ఏదో చెప్పబోతుందని తెలుస్తుంది. కానీ అది వ్యక్తిగతమైందా? లేక వృత్తిపరమైనదా? అన్నది తెలియడం లేదు. కానీ ఏదో ఒక గుడ్ న్యూస్ ఉందని మాత్రం అర్థం అవుతోంది. ఇంతకీ ఆమె ఏం చెప్పిందంటే.. నా దగ్గర ఒక సీక్రెట్ ఉంది.. అది ఎంతో కాలం సీక్రెట్‌గా ఉండలేదు.. నేను దాచుకోలేను.. మీ అందరితోనూ ఆ విషయాన్ని పంచుకునేందుకు ఎంతగానో ఎదురుచూస్తున్నాను అంటూ పోస్ట్ పెట్టింది. ఇంకేమి ఉంటుంది పెళ్లి గురించే అంటూ .. నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు .

Next Story

Most Viewed