సమంత అలా చేస్తుందనుకోలేదు.. అసలు నిజాలు బయటపెట్టిన స్టార్ డైరెక్టర్ సుకుమార్!

by Disha Web Desk 6 |
సమంత అలా చేస్తుందనుకోలేదు.. అసలు నిజాలు బయటపెట్టిన స్టార్ డైరెక్టర్ సుకుమార్!
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అందరికీ సుపరిచితమే. ఈ అమ్మడు ఏమాయ చేసావే సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్‌గా గత కొద్ది కాలంగా ఇండస్ట్రీలో కొనసాగుతుంది. ఈ అమ్మడు టాలీవుడ్ స్టార్ హీరోలతో నటించి తన నటన, అందంతో సినీ ప్రేక్షకులను మెప్పించింది. కానీ ఆమెకు మయోసైటీస్ రావడంతో.. చికిత్స తీసుకుని ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. గత కొద్ది కాలంగా సినిమాలకు దూరమైన ఆమె రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయింది. ప్రస్తుతం యాడ్స్ చేస్తూనే ఆఫర్ల కోసం ఎదురుచూస్తుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ తన హాట్ ఫొటోలతో హీట్ పుట్టిస్తోంది.

ఈ క్రమంలో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్.. సమంత గురించి పలు కామెంట్లు చేయడంతో అవి కాస్త నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుకుమార్ రంగస్థలం మూవీలో ఆమె నటన గురించి పలు విషయాలు పంచుకున్నాడు. ఆయన మాట్లాడుతూ.. ‘‘రంగస్థలం సినిమా స్టోరిని రామ్ చరణ్‌ను దృష్టిలో పెట్టుకొనే రాశాను. ఆయన కూడా అద్భుతంగా నటించాడు. కానీ ఇందులో హీరోయిన్‌గా నటించిన సమంత రామలక్ష్మి పాత్ర ఎలా చేస్తుందో అని అనుకున్నాను. ఎందుకంటే.. ఆ క్యారెక్టర్ ఆమె కోసం రాయలేదు కొత్త ఆమెను తీసుకుందామని ప్లాన్ చేసుకున్నాము. దానికి కారణం రామ్ చరణ్, సమంత వంటి ఇద్దరు స్టార్స్‌ను సెట్‌లో మేనేజ్ చేయలేనేమో అని అనుకున్నాను.

కానీ నేను రాసుకున్న స్క్రిప్ట్ ప్రకారం.. తెలుగు వచ్చిన అమ్మాయి కావాలి. అప్పుడే సమంత అయితే పల్లెటూరి అమ్మాయిలా ఆ పాత్రకు సరిపోతుందని ఆమెను తీసుకున్నాము. కానీ, ఎలా చేస్తుందో అన్న భయం మాత్రం ఉండేది. షూటింగ్ సమయంలో ఆమె నటన చూసి నేను ఆశ్చర్యపోయాను. ప్రతి సీన్‌లోనూ ఆమె అద్భుతంగా నటించింది. ఆమె అలా చేస్తుందని నేను కూడా అనుకోలేదు. ఆమె నటన చూసినప్పుడే డిసైడ్ అయ్యాను. నేను సినిమాలు తీసినంత కాలం సమంతతో వర్క్ చేయాలని’’ అంటూ చెప్పుకొచ్చాడు.

Next Story

Most Viewed