భార్యకు సర్‌ప్రైజ్ ఇచ్చిన మంచు విష్ణు.. వీడియో వైరల్

by Disha Web Desk 7 |
భార్యకు సర్‌ప్రైజ్ ఇచ్చిన మంచు విష్ణు.. వీడియో వైరల్
X

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్న ఈ పౌరాణిక కథలో.. మోహన్ లాల్, శివరాజ్ కుమార్‌తో పాటు ప్రభాస్ కూడా కీలక పాత్రలో నటించుబోతున్నారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే ఈ మూవీ మొదటి షెడ్యూల్ పూర్తికాగా.. ఇటీవలే న్యూజిలాండ్‌కు బయలుదేరి వెళ్లారు. ప్రస్తుతం కన్నప్ప రెండో షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. ఇదిలా ఉంటే.. ఓపక్క సినిమాలతో బిజీగా ఉన్న విష్ణు ఫ్యామిలీ కోసం కూడా తన టైం కేటాయిస్తున్నాడు.

ఈ రోజు మంచు విష్ణు తన 15వ పెళ్లి రోజు సందర్భంగా భార్య విరానికా కోసం సర్‌ప్రైజ్ ప్లాన్ చేశాడు. ఈ మేరకు హెలికాఫ్టర్‌లో ఆమెను తీసుకెళ్లి పెళ్లి రోజు శుభాకంక్షలు తెలిపాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ‘కన్నప్ప’ షూటింగ్‌లో బిజీగా ఉన్న భార్య కోసం టైం కేటాయించావు అన్నా. నువ్వు గ్రేట్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.



Read More..

మెగా డాటర్ సినిమాకు ప్రఖ్యాత అవార్డ్.. ఆనందంలో ఫ్యాన్స్



Next Story