మతం కోసం ఇండస్ట్రీనే వదిలేసిన హీరోయిన్?

by Disha Web Desk 18 |
మతం కోసం ఇండస్ట్రీనే వదిలేసిన హీరోయిన్?
X

దిశ,వెబ్‌డెస్క్: సినీ ఇండస్ట్రీకి కొంత మంది చిన్న వయసులోనే ఎంట్రీ ఇచ్చి, మొదటి లేదా రెండో సినిమాతోనే మంచి పాపులారిటీ సంపాదించుకుంటారు. ఇక వారు తర్వాత ఇండస్ట్రీలో స్టార్ రేంజ్‌కు ఎందుగుతారు అనుకునేలోపే.. సడెన్‌గా చిత్రపరిశ్రమకు గుడ్ బై చెప్పి వెళ్లిపోతుంటారు. అలాంటి వారిలో ఓ బ్యూటీ కూడా ఉంది. ఆమె ఎవరో? తన గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

చిన్న వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి మూడు సినిమాలతోనే మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న నటి జైరా వాసిమ్. ఈ ముద్దుగుమ్మ 15 ఏళ్ల వయసులో అమీర్ ఖాన్‌తో కలిసి దంగల్ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఈ చిత్రంలో నటి యంగ్ గీతా ఫోగట్ పాత్ర పోషించి, నటనతో ప్రేక్షకులను మెప్పించింది. ఆ మూవీలో జైరా నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దంగల్ మూవీ భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. దీంతో ఇక ఈ సినిమాలో నటించిన జైరా.. తర్వాత చాలా సినిమాల్లో నటించి స్టార్ హోదాకు వెళ్తుందని చాలా మంది అనుకున్నారు. కానీ ఆమె ఎవరూ ఊహించని విధంగా, మతం కోసం ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పి వెళ్లిపోయిందంట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


Next Story

Most Viewed