దిశతో ఆ విషయాలను ఓపెన్‌గా చెప్పేసిన స్టార్ నటడు.. హీరోగా ఉండలేనంటూ కామెంట్స్!(వీడియో)

by Disha Web Desk 8 |
దిశతో ఆ విషయాలను ఓపెన్‌గా చెప్పేసిన స్టార్ నటడు.. హీరోగా ఉండలేనంటూ కామెంట్స్!(వీడియో)
X

దిశ, సినిమా : కోలివుడ్ స్టార్ హీరో విశాల్ రత్నం సినిమాతో తెలుగుప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. సింగం ఫేమ్ దర్శకుడు ఈ మూవీ తెరకెక్కించగా, ఇందులో ప్రియాభవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా, ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉండటంతో, మూవీ టీం ప్రమోషన్స్ మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే హైదరబాద్‌లో నిర్వహించిన ఓ ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న విశాల్,దిశ టీంతో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ఆయన మాట్లాడుతూ..పందెం కోడి విశాల్‌ను చూసి చాలా రోజులయ్యింది కదా అలాంటి యాంగిల్‌లోనే మళ్లీ మీకు కనిపించనున్నాను, అందరికి నచ్చిన విషయాన్నే తీసుకొని సినిమా తీశాం. రత్నం సినిమాలో అమ్మాయికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి తీసిన సినిమా ఇది. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి ఇది నా లైఫ్‌లో కూడా జరిగింది అనుకుంటారు.. సినిమా క్లైమాక్స్ చాలా బాగుంటుందని చెప్పుకొచ్చారు. అలానే మీరు ప్రతి ఇష్యూపై కూడా స్పందిస్తారు.. ఇంత స్టార్ అయి ఉండి కూడా ప్రతి చిన్న విషయంపై స్పందించడంతో మీకు నెగిటివిటి పెరుగుతోంది అని అడగడంతో విశాల్ స్పందిస్తూ..నెగిటివిటి లేకుండా ఏది ఉండదు. అందరినీ నేను సంతోష పెట్టాలంటే నేను నటుడిగా ఉండలేను..ఐస్ క్రీమ్ అమ్మాలి అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన దిశతో చాలా విషయాలను పంచుకున్నారు. ఈ వీడియోలో చూసేయండి.


Next Story

Most Viewed