ఒకే రోజు ఇద్దరు లెజెండ్స్ బర్త్ డే.. సంబరాలు చేసుకుంటున్న అభిమానులు

by Disha Web Desk 2 |
ఒకే రోజు ఇద్దరు లెజెండ్స్ బర్త్ డే.. సంబరాలు చేసుకుంటున్న అభిమానులు
X

దిశ, సినిమా: ప్రముఖ చిత్ర దర్శకుడు మణిరత్నం, మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజాలకు పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. జూన్ 2న ఈ లెజెండ్స్ బర్త్‌‌డే కాగా వీళ్లకు సంబంధించిన క్లాసిక్ పాటలు, చిత్రాలను గుర్తు చేసుకుంటూ అభిమానులు మురిసిపోతున్నారు. ఈ మేరకు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ సహా 1400 పైగా చిత్రాలకు ఇళయరాజా సంగీతం అందించగా.. మణిరత్నం కూడా తన సినిమాలతో దేశవ్యాప్తంగా అభిమానులను సొతం చేసుకున్నాడు. ఎన్నో అవార్డులు అందుకున్న ఈ స్టార్లు ఇప్పటికీ తమ కళా నైపుణ్యంతో ఫ్యాన్స్‌ను అలరిస్తూనే ఉన్నారు. ఇక ఇళయరాజా కొడుకు యువన్ శంక‌ర్ రాజా కూడ తండ్రికి తగ్గ తనయుడుగా మ్యూజిక్ డైరెక్టర్‌గా రాణిస్తుండగా.. మణిరత్నం కొడుకు ఇంకా ఇండస్ట్రీవైపు అడుగులు వేయలేదు.



Next Story