గుంటూరు కారం’ ప్రీరిలీజ్ ఈవెంట్ అలా ప్లాన్ చేశారా..?

by Disha Web Desk |
గుంటూరు కారం’ ప్రీరిలీజ్ ఈవెంట్ అలా ప్లాన్ చేశారా..?
X

దిశ, సినిమా: సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గుంటూరు కారం’. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకులు మంచి అంచనాలతో ఉన్నారు. శ్రీలీల, మీనాక్షీ చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానుంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా షూట్ నవంబర్ ఎండింగ్‌కు ఆల్మోస్ట్ పూర్తి చేయాలని మేకర్స్ ప్లాన్. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీకి సంబంధించిన సాలిడ్ అప్డేట్ ఇచ్చింది మూవీ యూనిట్. ఏంటంటే ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను ఇప్పటి వరకు టాలీవుడ్‌లో ఎవరూ చేయని విధంగా ఫ్యాన్స్, గెస్టుల మధ్యన నిర్వహించాలని.. ఆ తర్వాతే ఈ ఈవెంట్‌ను టెలికాస్ట్ చేయాలనే ప్లాన్‌లో ఓ ఉన్నారట. ఇంతకీ ఈ ఈవెంట్ ఎక్కడ జరుగుతుంది? ఎవరు హాజరు అవుతున్నారు? అనే వివరాలు తెలియాల్సి ఉన్నాయి.

Next Story