సాయి పల్లవి తండ్రి నిజంగా నేరస్థుడా ?

by Disha Web |
సాయి పల్లవి తండ్రి నిజంగా నేరస్థుడా ?
X

దిశ, వెబ్‌డెస్క్ : లవ్‌లీ బ్యూటీ సాయి పల్లవి ఏ పాత్రలోనూ ఇట్టే ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. అంతే కాకుండా ఆమె ఎంచుకునే ప్రతి పాత్రలో తనని తాను తిరిగి ఆవిష్కరించుకుంటుంది. కాగా ఈ యంగ్ బ్యూటీ రాబోయే చిత్రం 'గార్గి' ఇది జూలై 15న విడుదల కానుంది. ఈ మేరకు మేకర్స్ ట్రైలర్‌ని వదిలేశారు.

ఈ ట్రైలర్‌లో సాయిపల్లవి ఓ స్కూల్ టీచర్‌గా కనిపిస్తుంది. మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఆమె కుటుంబంతో సంతోషంగా జీవిస్తుంది. ఒక్కసారిగా పల్లవి వాళ్ల తండ్రిని పోలీసులు అరెస్టు చేస్తారు. అయితే అతన్ని ఎందుకు అరెస్టు చేశారు.. ఆయన నిజంగా నేరస్థుడా ? తన పోరాటంలో సాయి పల్లవి తనకు ఎదురయ్యే అడ్డంకులను ఎలా అధిగమిస్తుంది అనేది గార్గి. ఇక ఈ సినిమా న్యాయ వ్యవస్థ చుట్టూ తిరిగే సన్నివేశాలతో ఆసక్తిగా సాగింది. గౌతమ్ రామచంద దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర బృధం నాని, రానాలతో తెలుగు ట్రైలర్‌ను, హీరో సూర్య, ఆర్య, అనిరుధ్, లోకేశ్ కనగరాజ్లతో తమిళ ట్రైలర్‌ను విడుదల చేయించింది.


Next Story

Most Viewed