ఆత్మహత్య చేసుకున్న ప్రముఖ సింగర్

by Mahesh |
ఆత్మహత్య చేసుకున్న ప్రముఖ సింగర్
X

దిశ, వెబ్‌డెస్క్: హాంకాంగ్‌‌కు చెందిన సింగర్ కోకో లీ(48) ఆత్మహత్య చెసుకుంది. ఈ వార్తను ఆమె తోబుట్టువులు బుధవారం మీడియాకు తెలిపారు. ఆమె కొన్నేళ్లుగా డిప్రెషన్‌తో బాధపడుతోందని లీ అక్కలు కరోల్, నాన్సీ లీ చెప్పుకొచ్చారు. వారం కిందట ఆత్మహత్యకు ప్రయత్నించడంతో ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. కోమాలో ఉన్న ఆమె బుధవారం మృతి చెందిందని వారు తెలిపారు. లీ 1994లో 19 సంవత్సరాల వయస్సులో తన మొదటి ఆల్బమ్‌ను విడుదల చేసింది. లీ మొదట్లో మాండోపాప్ గాయనిగా ప్రారంభించినప్పటి, తర్వాత ఆమె దాదాపు 30 ఏళ్ల కెరీర్‌లో కాంటోనీస్, ఆంగ్లంలో ఆల్బమ్‌లను విడుదల చేసింది. "అంతర్జాతీయ సంగీత సన్నివేశంలో చైనీస్ గాయకులకు కొత్త ప్రపంచాన్ని తెరవడానికి కోకో లీ అవిశ్రాంతంగా పనిచేసినట్లు ప్రసిద్ధి చెందింది. ఆమె చైనీయుల కోసం ప్రకాశిస్తుంది" అని ఆమె సోదరీమణులు తమ పోస్ట్‌లో తెలిపారు.

Also Read: జ్యువెలరీ యాడ్‌కు సితార తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాకే..

Advertisement

Next Story