సుమతో డివోర్స్‌పై రాజీవ్ కనకాల క్లారిటీ

by Disha Web Desk 9 |
సుమతో డివోర్స్‌పై రాజీవ్ కనకాల క్లారిటీ
X

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. అగ్రహీరోల ఈవెంట్లకు హూస్టింగ్ చేస్తూ.. స్టార్‌లను మించిన స్టార్‌గా మారిపోయింది. కాగా.. ఇటీవల రాజీవ్ కనకాల మధ్య మనస్పర్థాలు వచ్చాయనీ, ఇద్దరు డివోర్స్ తీసుకోబోతున్నారంటూ నెట్టింట ఓ వార్త హల్ చల్ సృష్టించిన సంగతి తెలిసిందే. దీనిపై సుమ చాలా సార్లు క్లారిటీ ఇచ్చినా కూడా ఈ వార్తలకు ముగింపు పలకడం లేదు. తాజాగా రాజీవ్ ఓ ఇంటర్వ్యూలో హాజరై ఈ పుకార్లపై స్పందించాడు.

‘‘నేను, సుమ విడాకులు తీసుకుంటున్నామని చాలా కాలం నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. కానీ అలాంటిది ఏం లేదు. చెబుతున్నా కూడా వినిపించుకోవడం లేదు. ఇవే పుకార్లు మా తల్లిదండ్రులు ఉన్నప్పుడు వచ్చుంటే ఇంకా ఎక్కువ బాధ ఉండేదేమో. సుమ ఇలాంటి న్యూస్‌లను పెద్దగా పట్టించుకోదు. కానీ నేను అంత ఈజీగా తీసుకోలేను. ఈ విషయంలో మా పిల్లలు చాలా సఫర్ అయ్యారు. తమ స్కూల్లో వాళ్లకు ఎదురయ్యే ప్రశ్నల వల్ల ఎంత ఇబ్బంది పడి ఉంటారు. ప్రతీ ఒక్కరు ఆలోచించాలి కదా? మేమిద్దరం కలిసే ఉన్నామని అందరికి అర్థం కావడం కోసం తన షోకు, ఈవెంట్స్‌కు వెళ్లాను. రీసెంట్‌గా మేం యూఎస్ వెళ్లినప్పుడు రీల్స్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాం. కలిసే ఉన్నాం అని చెప్పుకోవడానికి కూడా చాలా కష్టమవుతోంది. ’’ అంటూ రాజీవ్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇది నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.



Next Story