మహేష్ బాబు హీరో అయ్యాక డ్యూయల్ రోల్‌లో నటించిన సినిమా ఎదో తెలుసా?

by Disha Web Desk 6 |
మహేష్ బాబు హీరో అయ్యాక డ్యూయల్ రోల్‌లో నటించిన సినిమా ఎదో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తన టాలెంట్‌తో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నాడు. ఎన్నో కొత్త కాన్సెప్ట్స్ తో సినిమాలు తీసి అన్ని వర్గాల ప్రేక్షకులలోనూ అభిమానులను సంపాదించుకున్నాడు.

ఇదిలా ఉంటే ఇప్పటి వరకు చాలా మంది టాలీవుడ్ స్టార్ హీరోలు డ్యూయల్ రోల్స్‌లో నటించి మెప్పించిన సినిమాలు చాలానే ఉన్నాయి. కొంత మంది ఇప్పటికీ నటిస్తూనే ఉన్నారు. అయితే అలా మహేష్ బాబుకు మాత్రం చెప్పుకోదగ్గ డ్యూయల్ రోల్స్ లేవని తెలుస్తోంది. చైల్డ్ ఆర్టిస్టు‌గా ఉన్నప్పుడు కొడుకు దిద్దిన కాపురం, బాల చంద్రుడు, అన్నా తమ్ముడు వంటి సినిమాల్లో డ్యూయల్ రోల్‌లో నటించాడు. కానీ, మహేష్ బాబు హీరో అయ్యాక మాత్రం డ్యూయల్ రోల్‌లో ఒకే ఒక్క సినిమాలో నటించారట. ఎస్ జె సూర్య దర్శకత్వంలో వచ్చిన నాని సినిమాలో మహేష్ బాబు నటించాడు. మూవీ చివరికి వచ్చిన కొద్ది సేపు మాత్రమే తండ్రి కొడుకులుగా మహేష్ కనిపిస్తారు. ఈ సినిమా విడుదలై యావరేజ్ టాక్‌ను సొంతం చేసుకుంది.

Read More : తండ్రి బాటలోనే తనయుడు.. గొప్ప మనసు చాటుకుంటున్న గౌతమ్‌



Next Story

Most Viewed