సమంత ఇలాంటి మెలిక పెడుతుందనుకోలేదు.. ఆమె కండీషన్స్‌కు డైరెక్టర్స్ షాక్!

by Disha Web Desk 8 |
సమంత ఇలాంటి మెలిక పెడుతుందనుకోలేదు.. ఆమె కండీషన్స్‌కు డైరెక్టర్స్ షాక్!
X

దిశ,సినిమా : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.అందం, అభినయంతో ఎంతో మందిని ఆకట్టుకుంది.ఈ ముద్దుగుమ్మ ఏమాయ చేశావే సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమై, తర్వాత స్టార్ హీరోస్ అందరి సరసన నటించి మంచి ఫేమ్ సంపాదించుకుంది.

ఇక తర్వాత అక్కినేని నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ కొన్ని రోజులకే విడాకులు తీసుకొని విడిపోయింది. ఆ తర్వాత మయోసైటీస్ వ్యాధి బారిన పడి , చాలా రోజులు మూవీస్‌కు బ్రేక్ ఇచ్చింది. ఇక ఈ మధ్యనే సమంత మళ్లీ చిత్రపరిశ్రమలోకి రీ ఎంట్రీ ఇచ్చింది. కాగా, ప్రస్తుతం తెలుగులో సమంతకు కొన్ని ఆఫర్స్ వస్తున్నాయంట.అయితే ఆమె తాను నటించే సినిమాలల్లో తానే ఫస్ట్ హీరోయిన్‌గా ఉండాలని కండిషన్ పెడుతుందంట. దీంతో ఈమె కండీషన్స్ విని స్టార్ డైరెక్టర్స్ సైతం షాక్ అవుతున్నారంట. ప్రస్తుతం ఇండస్ట్రీని చాలా మంది బ్యూటీస్ ఏలేస్తున్నారు. యంగ్ బ్యూటీస్‌కు చాలా క్రేజ్ ఉంది. ఇలాంటి టైమ్‌లో సమంత ఇలా కండిషన్స్ పెట్టడం సరికాదు అంటూ కామెంట్స్ చేస్తున్నట్లు సమాచారం. కాగా, ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

Next Story

Most Viewed