Dipika Kakar : నటనకు స్వస్తి చెప్పబోతున్న దీపిక.. పుట్టుబోయే బిడ్డ కోసమేనా?

by Dishanational2 |
Dipika Kakar : నటనకు స్వస్తి చెప్పబోతున్న దీపిక.. పుట్టుబోయే బిడ్డ కోసమేనా?
X

దిశ, సినిమా: మాతృత్వాన్ని స్వీకరించిన తర్వాత నటనకు స్వస్తి చెప్పబోతున్నట్లు వస్తున్న వార్తలపై దీపికా కాకర్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఏడాది జూలైలో బిడ్డకు జన్మనివ్వబోతున్న ఆమె.. తన కెరీర్‌పై జరుగుతున్నదంతా తప్పుడు ప్రచారమంటూ కొట్టిపారేసింది. ఈ మేరకు నటనను విడిచిపెట్టే ఆలోచన లేదని, తన వ్యాఖ్యలను ప్రజలు తప్పుగా అర్థం చేసుకుని రూమర్స్ క్రియేట్ చేస్తున్నారని తెలిపింది. గృహిణిగా జీవితాన్ని గడపాలని ఎప్పటినుంచో ఆరాటపడుతున్నది నిజమేనన్న ఆమె.. ‘నేను రాబోయే నాలుగు-ఐదు సంవత్సరాలు పని చేయను. ఆ సమయాన్నంత నా బిడ్డతో గడిపి ఆనందించాలనుకుంటున్నా. అంతేకానీ పని నుంచి తప్పుకుంటానని ఎప్పుడూ చెప్పలేదు. ఒకవేళ అనుకోకుండా మంచి ఆఫర్ వస్తే దానిని కూడా అంగీకరించవచ్చు. అయితే ఇదంతా నా బిడ్డకు స్వాగతం పలికిన తర్వాత మాత్రమే చెప్పగలను’ అంటూ పలు విషయాలను ప్రస్తావించింది.

Also Read..

నటి సూసైడ్ కేసులో షాకింగ్ నిజాలు.. లోదుస్తులపై స్పెర్మ్

Next Story

Most Viewed