ఆ కేసులో నటికి జరిమానా తగ్గించిన న్యాయస్థానం.. రిపీట్ కావొద్దంటూ వార్నింగ్

by Web Desk |
ఆ కేసులో నటికి జరిమానా తగ్గించిన న్యాయస్థానం.. రిపీట్ కావొద్దంటూ వార్నింగ్
X

దిశ, సినిమా : బాలీవుడ్ నటి జుహీ చావ్లా 5జీ నెట్‌వర్క్‌ను సవాల్ చేస్తూ పర్యావరణవేత్తలతో కలిసి గత ఏడాది ఢిల్లీ హైకోర్టులో కేసు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై పలుమార్లు విచారించిన ధర్మాసనం.. జుహీ చావ్లా కేవలం పబ్లిసిటీ కోసమే ఇదంతా చేస్తోందంటూ ఆమెకు 20 లక్షల జరిమానా సైతం విధించింది. అయితే జరిమానా తగ్గించాలన్న తన వినతిని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం.. రూ.20 లక్షల నుంచి రూ.2 లక్షలకు తగ్గిస్తున్నట్లు పేర్కొంది.

ఈ క్రమంలో జుహీ చావ్లా ఢిల్లీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (DSLSA)తో కలిసి పనిచేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చింది. సమాజంలో అట్టడుగు వర్గాలకు సాధికారత కల్పించే కార్యక్రమాల్లో నటిస్తానని ఢిల్లీ కోర్టుకు తెలపడంతో.. ప్రచారం కోసం దావా వేసినట్లు ఆమెపై న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలను ఢిల్లీ హైకోర్టు తొలగించింది. ఇందుకు సంబంధించిన దావాను కొట్టివేసిన సింగిల్ బెంచ్.. ఇలాంటి విషయాల వల్ల కోర్టు సమయం వృధా అవడం తో పాటు మిగతా కార్యకలాపాలకు అంతరాయం కలుగుతుందని, భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూసుకోవాలంటూ హెచ్చరించింది.



Next Story

Most Viewed