పగటి కలలు కనడం కూడా వ్యాయామమే.. ఆసక్తికరంగా నమ్రత పోస్ట్

by Disha Web Desk 7 |
పగటి కలలు కనడం కూడా వ్యాయామమే.. ఆసక్తికరంగా నమ్రత పోస్ట్
X

దిశ, సినిమా: సూపర్ స్టార్ మహేశ్ బాబు భార్య నమ్రత గురించి తెలిసిందే. మహేశ్ బాబు ‘వంశీ’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈమె.. ‘అంజి’, ‘టక్కరి దొంగ’ మూవీస్ చేసి ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత మిల్క్ బాయ్ మహేశ్ బాబుతో ప్రేమలో పడిన నమ్రత.. ప్రేమ పెళ్లి చేసుకుని సినిమాలకు పూర్తిగా దూరం అయింది. ఫ్యామిలీ లైఫ్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ.. కుటుంభాన్ని చూసుకుంటూ ఉంటోంది.

అయితే.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నమ్రత.. తనకు, ఫ్యామిలీకి సంబంధించిన ప్రతి విషయాన్ని ప్రేక్షకులతో పంచుకుంటోంది. అంతే కాకండా.. సినిమాల్లో నటించనప్పటికీ ఫిట్‌నెస్ మాత్రం అలాగే మెయింటేన్ చేస్తుంది. ఈ మేరకు జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ సందడి చేస్తుంది నమ్రత. ఇందుకు సంబంధించిన ఫొటోలు సైతం నెట్టింట షేర్ చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా.. జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ.. సాడ్‌గా కూర్చున్న ఫొటో షేర్ చేస్తూ.. ‘సీట్స్ మద్య పగటి కలలు.. వ్యయామం’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.






Next Story

Most Viewed