- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్‌సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
పెళ్లి జరిగిన నెల రోజులకే విడాకులు.. అసలు విషయాలు చెప్పిన నటి!
దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ కమెడియన్ రోబో శంకర్ ముందుగా బుల్లితెరకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత స్టార్ హీరోల చిత్రాల్లో నటించి ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్నాడు. అంతేకాకుండా ఆయన కూతురు ఇంద్రజ శంకర్‌ను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఆమె శంకర్ వారసురాలిగా పరిచయం అయి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా తలపతి విజయ్ నటించిన విజిల్ మూవీతో ఇంద్రజకు ఫుల్ క్రేజ్ వచ్చింది. అయితే ఇంద్రజకు దర్శకుడు కార్తీక్‌తో మార్చి 24న అంగంరంగ వైభవంగా పెళ్లి జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు కోలీవుడ్, టాలీవుడ్ స్టార్స్ హాజరై సందడి చేశారు. వీరిద్దరి పెళ్లి మధురైలో జరగ్గా.. చెన్నైలో రిసెప్షన్ జరిగింది. అయితే ఇంద్రజ సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన పర్సనల్ లైఫ్‌ను తన భర్తతో కలిసి ఎంజాయ్ చేస్తుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ భర్తతో కలిసి దిగిన ఫొటోలు షేర్ చేస్తుంది. ఈ క్రమంలోనే ఈ కొత్త జంటపై కొందరు ట్రోల్స్ చేస్తున్నారు.
తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇంద్రజ తన జంటపై ఓ వ్యక్తి చేసి కామెంట్స్‌పై స్పందించింది. ‘‘నాపై ఓ వ్యక్తి అసహ్యకరమైన కామెంట్స్ చేశాడు. నేను ఆ వ్యక్తి పేరును మర్చిపోయాను. అలాగే స్క్రీన్‌షాట్ తీయలేదు. ఏమన్నాడంటే.. మీరు ఇంకెన్ని రోజులుగా జంటగా ఇంటర్వ్యూలు చేస్తారో చూద్దాం. త్వరలో విడివిడిగా ఇంటర్య్వూకి వెళతారు. తొందరలోనే విడాకులు కూడా తీసుకుంటారు అని అన్నాడు. నాకు నా భర్త మూడుముళ్లు వేయడం చూసి కూడా అలా అనడానికి నీకు మనసు ఎలా వచ్చింది. అసలు వేరొకరి జీవితంపై అలాంటి తీర్పును ఎలా జారీ చేస్తారు. నాకు అర్థం కాక అడుగుతున్నాను. విడాకులు తీసుకునే దాన్ని అయితే పెళ్లి ఎందుకు చేసుకుంటాను. మా వివాహం అయి కూడా నెలరోజులు కాకముందే విడాకులు తీసుకుంటారని అనడం ఏంటి అసలు.
అయినా నా వ్యక్తిగత జీవితంపై తీర్పు ఇవ్వడానికి అతనికి ఏం హక్కు ఉంది. అతని మాటలకు నాకు చాలా బాధేసింది. ప్రస్తుతం నా భర్తతో సంతోషంగా ఉన్నాను. జీవితాంతం ఉంటాను. కాబట్టి కొందరు ఇతరులపై ఫోకస్ పెట్టకుండా.. వారి పనులు చూసుకుంటే బాగుంటుంది’’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇంద్రజ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.