గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి చిన్న కూతురు శ్రీజ.. కొత్త ప్రయాణం స్టార్ట్ చేసినందుకు థ్రిల్లింగ్‌గా ఉందంటూ పోస్ట్

by Disha Web Desk 6 |
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి చిన్న కూతురు శ్రీజ.. కొత్త ప్రయాణం స్టార్ట్ చేసినందుకు థ్రిల్లింగ్‌గా ఉందంటూ పోస్ట్
X

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమె ఒకానొక సమయంలో ఒక అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోయి సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ఓ కూతురు పుట్టాక అతడితో మనస్పర్థలు రావడంతో విడిపోయి మెగా ఇంటికి వచ్చేసింది. ఇక చిరంజీవి తన కూతురు బాధ చూడలేక హీరో కల్యాణ్ దేవ్‌కి ఇచ్చి గ్రాండ్‌గా పెళ్లి చేశాడు.

వీరిద్దరికి కూడా ఓ కూతురు పుట్టింది. కానీ ఇద్దరి మధ్య విభేదాలు ఏర్పడటంతో శ్రీజ తన కూతుర్లతో భర్తకు దూరంగా వెళ్ళిపోయింది. కల్యాణ్ దేవ్, శ్రీజ కూడా విడాకులు తీసుకున్నట్లు గత కొద్ది కాలంగా వార్తలు వస్తున్నప్పటికీ అధికారికంగా మాత్రం ప్రకటించలేదు. అయితే కల్యాణ్ దేవ్ మాత్రం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పలు పోస్టులు షేర్ చేస్తున్నాడు. ఇక శ్రీజ కూడా తన ఫ్యామిలీతో, కూతుర్లతో ఎంజాయ్ చేస్తూ.. ఆ ఫొటోలను నెట్టింట పెడుతుంది.

ఇదిలా ఉంటే.. తాజాగా, శ్రీజ గుడ్ న్యూస్ ప్రకటించింది. తను కొత్త బిజినెస్‌లో అడుగుపెట్టింది. ఈ విషయాన్ని తెలుపుతూ ఇన్‌స్టాతో ఆసక్తికర పోస్ట్ షేర్ చేసింది. ‘‘ఇదొక అద్భుతమైన ప్రయాణం. ఇందులో నేను జాయిన్ అయినందుకు చాలా థ్రిల్లింగ్‌గా ఉంది’’ అంటూ రాసుకొచ్చింది. శ్రీజ హైదరాబాద్‌లో అనంత స్టూడియో పేరుతో ఓ ఫిట్‌నెస్ సెంటర్‌ను స్టార్ట్ చేసింది. ఈ వ్యాపారం ప్రారంభోత్సవానికి హీరో సందీప్ కిషన్, రెజీనా కాసాండ్రా, శిల్పాశెట్టి హాజరై సందడి చేశారు. అయితే ఇందులో శరీరానికి ప్రశాంతత కలిగించడానికి జిమ్, యోగా ఇతరత్రా కార్యక్రమాలు ఉండనున్నట్లు సమాచారం. ఇక ఈ విషయం తెలిసిన మెగా ఫ్యాన్స్ శ్రీజను మెచ్చుకుంటున్నారు.



Next Story

Most Viewed