సక్సెస్‌ఫుల్‌గా పద్మవిభూషణ్ అవార్డు అందుకున్న చిరంజీవి.. హైలైట్‌గా నిలిచిన రామ్ చరణ్-ఉపాసన

by Anjali |   ( Updated:2024-05-10 12:41:02.0  )
సక్సెస్‌ఫుల్‌గా పద్మవిభూషణ్ అవార్డు అందుకున్న చిరంజీవి.. హైలైట్‌గా నిలిచిన రామ్ చరణ్-ఉపాసన
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ అగ్ర హీరో మెగాస్టార్ చిరంజీవికి ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మవిభూషణ్ అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, మెగాస్టార్ నేడు రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా పద్మవిభూషణ్ అవార్డు అందుకున్నారు. ఈ వేడుకకు చిరంజీవి సతీమణి సురేఖ, కుమారుడు రామ్ చరణ్, కోడలు ఉపాసన కూడా హాజరవ్వడం విశేషం. చిరంజీవితో మరో ఐదుగురికి పద్మ విభూషణ్, 17 మందికి పద్మభూషణ్, 110 మందికి పద్మశ్రీలు దక్కాయి. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవికి సోషల్ మీడియా వేదికన మెగా అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నాలుగు దశాబ్దాల చిత్ర పరిశ్రమ ప్రస్థానంలో కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్న నటుడు మెగాస్టార్ చిరంజీవి. సినీ పరిశ్రమకు, సమాజానికి చేసిన చేసిన సేవలను గుర్తించి కేంద్రం పద్మవిభూషన్ అవార్డు ప్రకటించింది.

Advertisement

Next Story

Most Viewed