వామ్మో ‘ఫ్యామిలీ స్టార్’ లో ఇన్ని బూతులా..?

by Disha Web Desk 7 |
వామ్మో ‘ఫ్యామిలీ స్టార్’ లో ఇన్ని బూతులా..?
X

దిశ, సినిమా: డైరెక్టర్ పరుశురామ్ దర్శకత్వం వహించిన తాజా సినిమా ‘ఫ్యామిలీ స్టార్’. రౌడీ హీరో విజయ్ దేవరకొండ, బ్యూటీఫుల్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంతపై దిల్ రాజ్, శిరీష్ నిర్మిస్తున్నారు. ఇందులో నుంచి ఇప్పటికే రిలీజైన ప్రతి అప్‌డేట్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఎన్నో అంచనాల నడుము ఈ చిత్రం ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిలీజ్ సమయం దగ్గర పటడంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచారు చిత్రం యూనిట్. అంతే కాకుండా రిలీజ్‌కు సంబంధించిన అన్నీ ఫార్మాలిటీస్ సైతం పూర్తి చేసుకుంది.

సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ జారి చేసినట్లు తెలుస్తుండగా.. కొన్ని డైలాగ్‌లు మ్యూట్ చేయించిందట. అయితే.. ఈ మూవీలో కొన్ని చోట్ల ఇంగ్లీష్ బ్యాడ్ వర్డ్స్ F*** లాంటివి యూస్ చేశారట. దీంతో సెన్సార్ ఆ పదాలపై అభ్యంతరం చెప్పడంతో.. ఆ డైలాగ్స్‌ను మ్యూట్ చెయ్యడం జరిగింది. ఈ న్యూస్ ప్రస్తుతం నెట్టింట వైరల్ కావడంతో.. ఫ్యామిలీ సినిమాల్లో కూడా బూతులు ఉపయోగిస్తారా డైరెక్టర్ అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కాగా.. 163 నిమిషాల నిడివితో ఈ చిత్రం థియేటర్లో సందడి చేయనుంది.

Next Story

Most Viewed