రతికా రోజ్‌కు బంపర్ ఆఫర్.. ఆ స్టార్ హీరో సినిమాలో చాన్స్..

by Disha Web Desk 7 |
రతికా రోజ్‌కు బంపర్ ఆఫర్.. ఆ స్టార్ హీరో సినిమాలో చాన్స్..
X

దిశ, సినిమా: బిగ్‌బాస్ బ్యూటీ రతిక రోజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు బిగ్‌బాస్ సీజన్-7 లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చి.. నెగిటివిటీతో మరింత ఫేమ్ దక్కించుకుంది. ఓ వైపు పల్లవి ప్రశాంత్.. మరోవైపు యావర్‌తో లవ్ ట్రాక్ నడిపించినట్లే నడిపి హౌస్‌లో కొనసాగింది. ఇక బయటకు వచ్చిన తర్వాత తన అందం మరింత పెంచుతున్న ఈ బ్యూటీ.. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేస్తూ సందడి చేస్తుంది. ఇదిలా ఉంటే.. ఫస్ట్ నుంచి సినిమాల్లో ట్రై చేస్తున్న బ్యూటీకి ప్రజెంట్ ఓ బంపర్ ఆఫర్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉంటూనే.. వరుస సినిమాలు బిజీగా ఉన్నాడు. అయితే.. ఇప్పుడు విజయ్‌కి సంబంధించిన ఓ సినిమాలో రతికా రోజ్‌కు ఓ కీలక పాత్రలో నటించే అవకాశం దక్కిందట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన న్యూస్ నెట్టింట వైరల్ కావడంతో.. ‘విజయ్ సినిమాలో చాన్స్ అంటే అంత ఈజీ కాదు.. మంచి పాత్రలు రావాలంటే ఎంతో అదృష్టం ఉండాలి. ఈ అవకాశాన్ని వినియోగించుకో రతిక’ అంటూ ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు నెటిజన్లు. అయితే.. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ మాత్రం రాలేదు.


Next Story

Most Viewed