బిగ్‌బాస్ బ్యూటీ రతిక పేరెంట్స్ భావోద్వేగ వ్యాఖ్యలు.. ఆల్మోస్ట్ కన్నీరు పెట్టి మరీ..!

by Anjali |
బిగ్‌బాస్ బ్యూటీ రతిక పేరెంట్స్ భావోద్వేగ వ్యాఖ్యలు.. ఆల్మోస్ట్ కన్నీరు పెట్టి మరీ..!
X

దిశ, వెబ్‌డెస్క్: నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న తెలుగు బిగ్‌బాస్ సీజన్‌-7లో పాల్లొన్న కంటెస్టెంట్లలో రతిక ఒకరు. ఈ బ్యూటీ హౌస్‌లో ఎంట్రీ ఇచ్చే రోజే ఎంతో యాక్టీవ్‌గా మాట్లాడుతూ.. ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. కానీ, కొన్ని లక్షల మంది చూస్తున్న జడ్జిమెంట్ ప్రొగ్రామ్‌లో ఎలా ముందుకు వెళ్లాలో తెలుసుకోలేకపోయింది. కాగా, నాలుగో వారంలోనే రతిక ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా రతిక తల్లిదండ్రులు హౌస్‌లో నా కూతురిపై అసవసరపు అబాండాలు వేశారంటూ పలు వ్యాఖ్యలు చేశారు.

రతిక తండ్రి రాములు మాట్లాడుతూ.. ‘‘మేం రైతు కుటుంబానికి చెందిన వాళ్లం. ఇప్పటికీ వ్యవసాయం చేస్తున్నాను. రతిక అసలు పేరు ప్రియ. తెలంగాణలోని తాండూర్‌కు చెందిన వాళ్లం. కానీ, ప్రస్తుతం మేం హైదరాబాద్‌లో ఉంటున్నాం. ఒకప్పుడు కనీసం రతిక బడి ఫీజులు కూడా కట్టలేని స్థితిలో ఉన్నాం. ఆమెకు నవోదయ పాఠశాల్లో సీటు రావడంతో చదివించగలిగాం. రతిక కావాలని ఎవ్వరినీ ఇబ్బంది పెట్టదు. తను ఇంట్లో ఎలా ఉందో బిగ్ బాస్ హౌస్‌లో కూడా అలాగే ఉంది. కావాలని నా బిడ్డపై లేనిపోనివి మాట్లాడారు.’’ అంటూ రతిక తండ్రి రాములు కన్నీళ్లు పెట్టుకున్నాడు.

Read More: కలర్స్ స్వాతిపై నవీన్ చంద్ర కామెంట్స్‌.. స్టేజీపైనే ఏడ్చేసిన హీరోయిన్

Next Story

Most Viewed