వయ్యారాలతో వడ్డిస్తూ.. అందాలతో అదరహో అనిపిస్తున్న అషికా రంగనాథ్

by Kavitha |
వయ్యారాలతో వడ్డిస్తూ.. అందాలతో అదరహో అనిపిస్తున్న అషికా రంగనాథ్
X

దిశ, సినిమా: కన్నడ నుంచి వచ్చి తెలుగులో విపరీతమైన ఫాలోయింగ్ పెంచుకున్న బ్యూటీ అషికా రంగనాథ్ అందరికీ సుపరిచితమే. ‘అమిగోస్’ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన నటించి తెలుగు తెరకు పరిచయమైన ఈ భామ రీసెంట్‌గా నాగార్జున హీరోగా నటించిన ‘నా సామిరంగ’ సినిమాతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకుంది. తెలుగులో చేసింది కొన్ని సినిమాలే కానీ తన అందం నటనతో ప్రేక్షకుల్లో సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్‌ని క్రియేట్ చేసుకుంది. వరుస సినిమాలు చేస్తూ తక్కువ సమయంలోనే స్టార్ డమ్ అందుకుంది ఈ వయ్యారి. సోషల్ మీడియాలోనూ తన అంద చందాలతో కుర్రకారుకు చెమటలు పట్టిస్తుంది ఈ భామ.

తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అందులో భాగంగా చీరకట్టులో తన స్కిన్ టోన్‌తో, క్యూట్‌నెస్‌తో ఫోటోలకి ఫోజులిచ్చింది ఈ ముద్దుగుమ్మ. అది చూసిన నెటిజన్లు అప్ కమింగ్ నేషనల్ క్రష్ అని.. సూపర్, లవ్ యూ అంటూ తెగ పొగిడేస్తున్నారు. మరి మీరు ఆ ఫోటోలపై మీరు ఓ లుక్ వేయండి.

Next Story

Most Viewed