ప్రభాస్‌ను ఎత్తుకున్న అనుష్క.. బాబోయ్ అంత బలం ఉందా?.. వైరల్ అవుతున్న ఫొటోలు..

by Dishafeatures3 |
ప్రభాస్‌ను ఎత్తుకున్న అనుష్క.. బాబోయ్ అంత బలం ఉందా?.. వైరల్ అవుతున్న ఫొటోలు..
X

దిశ, సినిమా : ప్రభాస్-అనుష్క జోడీకి సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వీరిద్దరి రీల్ కెమిస్ట్రీ, రియల్ ఫ్రెండ్‌షిప్ చూసి.. పెళ్లి చేసుకుంటే బాగుండని ఆశపడుతున్నారు. మేడ్ ఫర్ ఈచ్ అదర్‌లా కనిపించే వీరు ఇప్పటికైనా ఒక్కటి కావాలని కోరుతున్నారు. కానీ అటు స్వీటి, ఇటు డార్లింగ్ ఇద్దరు కూడా మ్యారేజ్ చేసుకోకుండానే ఉండిపోయారు. ఇక వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘బిల్లా’, ‘బాహుబలి’, ‘మిర్చి’ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్‌గా నిలవగా.. ప్రస్తుతం ‘మిర్చి’లో అనుష్క రెబల్ స్టార్‌ను ఎత్తుకున్న ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. దీంతో నిజంగానే ఈ బ్యూటీ ఆ కటౌట్‌ను ఎత్తుకునే సాహసం చేసిందా? అంత బలం ఉందా? అనే చర్చ జరుగుతుంది.

కాగా ‘మిర్చి’లో ఓ సాంగ్‌లో మామిడి పండును తెప్పేందుకు ప్రయత్నిస్తుంటుంది అనుష్క. అయితే తనకు అందకపోవడంతో ప్రభాస్‌ను ఎత్తుకోమంటుంది. కానీ మళ్లీ వద్దనుకుని డార్లింగ్‌ను ఎత్తుకుంటే పండు కోస్తాడు. కానీ మూవీలో చూపించినట్లుగా ప్రభాస్‌ను ఎత్తుకోలేదట అనుష్క. ఈ విషయాన్ని ప్రమోషన్స్ టైమ్‌లో మూవీ యూనిట్ వివరించింది. డార్లింగ్ టేబుల్ మీద నిల్చున్నాడని.. స్వీటి ఎత్తుకున్నట్లు జస్ట్ యాక్ట్ చేసిందని,దాన్ని సినిమాలో ఎడిట్ చేసి వేశామని చెప్పారు.


Next Story

Most Viewed