ఆ స్టార్ హీరోతో చాలా కంఫర్ట్‌గా ఉంటుంది.. అదే నా వీక్ నెస్: Anushka

by Hamsa |
ఆ స్టార్ హీరోతో చాలా కంఫర్ట్‌గా ఉంటుంది.. అదే నా వీక్ నెస్: Anushka
X

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘బాహుబలి’ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఫుల్ పాపులారిటీని దక్కించుకుంది. ఆ తర్వాత కాస్త మూవీలకు దూరంగా ఉంది. ఇటీవల మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి ‘మిస్టర్ పొలిశెట్టి మిస్ శెట్టి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేశాయి. తాజాగా, అనుష్క శెట్టి ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

‘‘నేను ఆరో తరగతి చదివే సమయంలోనే తన క్లాస్మేట్ ప్రపోజ్ చేశారు. నాకు ఐలవ్ యూ అంటే ఏంటో తెలియక ఒకే చేశాను. అది నాకు ఒక స్వీట్ మెమరీగా మిగిలిపోయిందని తెలిపింది. అంతేకాకుండా తనకు ఇండస్ట్రీలో త్రిష, భూమిక, నయనతార నటన చాలా బాగా నచ్చుతుందని తెలియజేశారు. ఇక ఈ అమ్మడు హీరోల గురించి మాట్లాడుతూ.. తనకు నాగార్జునతో నటించడం చాలా కంఫర్టుగా ఉంటుందని వెల్లడించింది. అలాగే తనకు ఫోన్ క్యారీ చేయడం అసలు చేతకాదని అదే పెద్ద వీక్‌నెస్ అని తెలిపింది. ప్రస్తుతం అనుష్క చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Also Read..పెళ్లికి ముందు శృంగారంలో తప్పులేదంటూ.. బెడ్‌పై ప్రియుడితో దర్శనమిచ్చిన తమన్న

Next Story

Most Viewed