ఆయనకు ఫోన్ చేస్తే అన్ని రొమాంటిక్ మాటలే.. నిర్మాత ఫోన్ కాల్ లీక్ చేసిన అనుపమ

by Disha Web Desk 9 |
ఆయనకు ఫోన్ చేస్తే అన్ని రొమాంటిక్ మాటలే.. నిర్మాత ఫోన్ కాల్ లీక్ చేసిన అనుపమ
X

దిశ, సినిమా: మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ గురించి సుపరిచితమే. ప్రేమమ్ చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. క్రేజ్ ఉన్న హీరోల సరసన నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ‘ఉన్నది ఒక్కటే జిందగీ, హలో గురు ప్రేమ కోసమే, రౌడీ బాయ్స్, రాక్షసుడు, తేజ్, 18 పేజెస్, కార్తికేయ, ఈగల్’ వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. తాజాగా సిద్ధు జొన్నలగడ్డ సరసన ‘టిల్లు స్వ్కేల్’ చిత్రంలో నటించింది.

ఈ మూవీ రేపు (మార్చి29) థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇందులో అనుపమ మునుపెన్నడూ కనిపించని విధంగా బోల్డ్ సీన్లతో రెచ్చిపోతుంది. అయితే ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా అనుపమ, నిర్మాత నాగవంశీ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. యాంకర్ సుమ.. ‘‘నీకు సిద్ధు జొన్నలగడ్డ తో నటించడం ఇబ్బందిగా అనిపిందా? లేక ప్రొడ్యూసర్‌తోనా? అని ప్రశ్నిస్తుంది. దీనిపై నాగవంశీ వెంటనే.. సిద్ధు, అనుపమ డేట్స్ అస్సలు సెట్ కావు. ఒకరివి దొరికితే ఇంకొకరివి దొరకవు.

2 ఏళ్ల నుంచి వారి వెంట పడుతూనే ఉంటున్నా. ఇక మూవీ అంతా కంప్లీట్ అయ్యాక చిన్న ప్యాచ్ వర్క్ ఉందని హీరోయిన్ కు ఫోన్ చేశాను. నన్ను తిట్టింది ’ అంటూ చెప్పుకొస్తాడు. తర్వాత అనుపమ మాట్లాడుతూ..‘నాగవంశీకి కాల్ చేస్తే అన్ని ఇలాంటి రొమాంటిక్ మాటలే మాట్లాడుతాడు. ఈయనతో కాల్స్ అంటే చాలా క్రిస్పీ గా ఉంటాయి’ అంటూ అనుపమ నిర్మాత ఫోన్ కాల్ బయటపెడుతోంది.


Next Story

Most Viewed