చిరంజీవి ‘విశ్వంభర’ సినిమాలో మరో టాలెంటెడ్ హీరోయిన్ కన్ఫర్మ్.. ఆ బ్యూటీ ఎవరంటే?

by Hamsa |
చిరంజీవి ‘విశ్వంభర’ సినిమాలో మరో టాలెంటెడ్ హీరోయిన్ కన్ఫర్మ్.. ఆ బ్యూటీ ఎవరంటే?
X

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ వశిష్ట కాంబోలో ‘విశ్వంభర’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీలో హీరోయిన్‌గా స్టార్ హీరోయిన్ త్రిష నటిస్తుంది. సోషియా ఫ్యాంటసీ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలో.. తాజాగా, ‘విశ్వంభర’ చిత్రం నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది.

ఇందులో మరో టాలెంటెడ్ యంగ్ బ్యూటీ అషికా రంగనాథ్ కూడా నటిస్తుంది. దీనికి సంబంధించిన పోస్టర్‌ను మేకర్స్ రివీల్ చేసి మెగా అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఇందులో అషిక మత్తెక్కించే చూపులతో పెదవుల దగ్గర చేతి పెట్టుకుని కనిపించింది. కాగా దీనికి కీరవాణి సంగీతం అందిస్తుండగా.. యూవీ క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతోంది. దీనికి వంశీ ప్రమోద్, విక్రమ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ సినిమా జనవరి 10న థియేటర్స్‌లో విడుదల కానున్నట్లు సమాచారం.

Next Story