నెట్టింట వైరలవుతోన్న రష్మిక మరో డీప్ ఫేక్ వీడియో!

by Anjali |
నెట్టింట వైరలవుతోన్న రష్మిక మరో డీప్ ఫేక్ వీడియో!
X

దిశ, వెబ్‌డెస్క్: ఇప్పటికే టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ వీడియో పై ఎంతో మంది సినీ ప్రముఖులు, మంత్రులు కూడా స్పందించారు. జరా పటేల్ అనే అమ్మాయి వీడియోను ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్‌తో రష్మికగా వీడియోగా క్రియేట్ చేశారు. జరా పటేల్ కూడా ఈ వీడియోపై స్పందించింది. ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు. ఈ విధంగా జరిగినందుకు చింతిస్తున్నాను అని వెల్లడించింది. ‘‘ఒక నటిగా నాకు ఇలాంటి పరిస్థితి ఎదురైంది. ఒకవేళ నేను స్కూల్, కాలేజ్ లో ఉన్నప్పుడు ఇలా జరిగితే నా పరిస్థితి ఏంటి? అని రష్మిక కూడా మండిపడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం కూడా ఇన్వెస్టిగేషన్ ప్రారంభించింది. కానీ నిందితులను పట్టుకోలేకపోయారు. దీంతో దుండగులు మరోసారి రెచ్చిపోయారు. తాజాగా ఈ హీరోయిన్‌పై మరో డీప్ ఫేక్ వీడియో సృష్టించారు. ప్రస్తుతం రష్మిక డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.




Advertisement

Next Story

Most Viewed