అనుకున్నదంతా అయింది.. భర్తను వదిలేస్తున్న అనసూయ.. ఇక ఒంటరిగానే...

by Dishafeatures3 |
అనుకున్నదంతా అయింది.. భర్తను వదిలేస్తున్న అనసూయ.. ఇక ఒంటరిగానే...
X

దిశ, సినిమా : జబర్దస్త్ బ్యూటీగా స్మాల్ స్క్రీన్‌పై మెరిసిన అనసూయ.. ఆ తర్వాత రంగమ్మత్తగా బిగ్ స్క్రీన్‌పై మెస్మరైజ్ చేసింది. డైరెక్టర్ సుకుమార్ పుణ్యమాని టాలీవుడ్‌తోపాటు కోలీవుడ్ నుంచి అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. కానీ ఎందుకో నెటిజన్స్ మాత్రం ఆమెను ఎనిమీగానే ట్రీట్ చేస్తున్నా.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా మాత్రం అభినందించాల్సిందే అంటుంటారు.ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే ఈ బ్యూటీ తాజాగా తన అభిమానులతో నెట్టింట చిట్ చాట్ చేసింది. వెకేషన్, నెక్స్ట్ ప్రాజెక్ట్స్ డిటెయిల్స్, ఫ్యాన్స్ ఇంపార్టెన్స్ గురించి ముచ్చటించింది.

ఓ అభిమాని నుంచి సోలో ట్రిప్ సజెషన్ అందుకున్న అనసూయ.. ‘నిజానికి ఈ థాట్ ఒకప్పుడు పిచ్చ భయమేసేది. కానీ ఇప్పుడు ఆలోచిస్తా’ అంటూ సోలో ట్రిప్‌ కోసం ఏదైనా సజెషన్స్ ఇవ్వమని కోరింది. అయితే మీరు ఎక్కడున్నా సంబరమే అని మరో ఫ్యాన్ అనగా.. సో స్వీట్ ఆఫ్ యూ అని మురిసిపోయింది. కానీ ఇప్పుడే అంత బడ్జెట్ లేదని చెప్పింది. దీంతో మొత్తానికి భర్తను వదిలేసి ఒంటరిగానే ట్రిప్స్‌కు వెళ్లేందుకు రెడీ అయిపోయావా అని నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.

ఇక ఆమె చేసే ప్రాజెక్ట్స్ తమ కోసమే కదా అని మరో అభిమాని అడగ్గా.. సగం తన కోసం అయితే మరో సగం ఫ్యాన్స్ కోసమని చెప్పింది. కాగా త్వరలో ‘పుష్ప 2’తో పలకరించబోతున్న అమ్మడు..ప్రస్తుతం ‘ఫ్లాష్‌బ్యాక్’ అనే తమిళ్ ఫిల్మ్ షూటింగ్‌లో పాల్గొంటుంది.


Next Story

Most Viewed