ఎన్టీఆర్ రికార్డు బద్దలు కొట్టిన అల్లు అర్జున్.. ఆ విషయంలో ట్రెండింగ్ వన్‌గా ఐకాన్ స్టార్

by Disha Web Desk 7 |
ఎన్టీఆర్ రికార్డు బద్దలు కొట్టిన అల్లు అర్జున్.. ఆ విషయంలో ట్రెండింగ్ వన్‌గా ఐకాన్ స్టార్
X

దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప 2’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ‘పుష్ప:ది రైజ్’కు సీక్వెల్‌గా వస్తున్న ఈ మూవీకి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంపై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటి వరక వచ్చిన ప్రతి అప్‌డేట్ ఎంతో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా.. రీసెంట్‌గా ‘పుష్ప 2’ నుంచి వచ్చిన టీజర్ నెట్టింట రికార్డుల మోతమోగిస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ఎన్టీఆర్ రికార్డులను కూడా బ్రేక్ చేసినట్లు తెలుస్తుంది.

జూనియర్ ఎన్టీఆర్ మూడు పాత్రల్లో వచ్చిన సినిమా ‘జైలవకుశ’. కె.ఎస్.రవీంద్ర దర్శకత్వంలో ఏడేళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ యూట్యూబ్‌లో ఏకంగా 137 గంటల పాటు టాప్‌లో ట్రెండ్ అయింది. ఇప్పుడు ఆ రికార్డును అల్లు అర్జున్ ‘పుష్ప 2’ టీజర్ బీట్ చేసింది. తాజాగా ‘పుష్ప 2’ టీజర్ 138 గంటల పాటు ట్రెండింగ్‌లో ఉండి కొత్త రికార్ట్‌ను క్రియేట్ చేసింది. ఈ ఏడేళ్లలో ఏ ఒక్క టీజర్ ఇంత ట్రెండింగ్‌లో ఉండక పోగా.. ఇప్పుడు అల్లు అర్జున్ ఎన్టీఆర్ రికార్డును బ్రేక్ చేశాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో మోస్ట్ ట్రెండింగ్ 1గా ఐకాన్ స్టార్ ‘పుష్ప 2’ టీజర్ నిలివడంతో.. ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోతుంది.



Next Story

Most Viewed