‘అహింస’ ప్రేక్షకుడికి పెద్ద హింసేనా..? డైరెక్టర్ తేజపై నెటిజన్లు ఫైర్..!

by sudharani |
‘అహింస’ ప్రేక్షకుడికి పెద్ద హింసేనా..? డైరెక్టర్ తేజపై నెటిజన్లు ఫైర్..!
X

దిశ, వెబ్‌డెస్క్: దగ్గబాటి అభిరాం హీరోగా తెరకెక్కిన మొదటి సినిమా‘అహింస’. డైరెక్టర్ తేజ రూపొందించిన ఈమూవీ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక మూవీ ఎలా ఉంది అనే విషయాల్లోకి వెళితే.. డైరెక్టర్ తేజ తెరకెక్కించిన ప్రేమ చిత్రాలు ‘జయం, నువ్వు నేను, ధైర్యం’ అన్ని కూడా డబ్బున్న వ్యక్తికి, సామాన్యుడికి మధ్య పోరాటంగా ఉంటాయి. ఈ సినిమా కూడా అదే విధంగా తీశారు. కథ సారాంశం ఆధారంగా సినిమా కాస్త స్లోగా ఉందని టాక్. అయితే.. కొన్ని కొన్ని సీన్లు ఎందుకు పెట్టారు అనే లాజిక్‌లు కూడా లేవు. కాస్త ట్రిమ్ చేసుకుంటే బావుండేదనిపించింది. ఇక సినిమా మంచి పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఐటెమ్ సాంగ్ పెట్టడం.. అది కూడా విలన్ ఇంట్లో కొడుకుల శవాలను పెట్టుకుని తీయడం. అదేం లాజిక్కో డైరెక్టర్‌కే అర్థం కావాలి అంటున్నారు నెటిజన్లు.

ఇక అభిరాం నటనకు మాత్రం ప్రశంసలు వస్తున్నాయి. హీరోయిన్ కూడా తన నటన పరంగా మంచి సినిమాలు ఉంటే టాప్ హీరోయిన్ల లిస్ట్‌లో చేరుపోద్ది అంటున్నారు నెటిజన్లు. ఓవరల్‌గా డైరెక్టర్ తేజ నుంచి ఒకటి అనుకుంటే మరొకటి ఎదురైంది. ‘అహింస’ సినిమా ప్రేక్షకులకు హింసే అని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరుకొందరు మాత్రం సినిమాలో కొన్ని సీన్లకు అస్సలు లాజిక్ లేవు అంటూ డైరెక్టర్‌పై ఫైర్ అవుతున్నారు. ఓవరల్‌గా సినిమాలో సీన్స్, వాటి లాజిక్లు పక్కన పెడితే నటన పరంగా పర్వాలేదు అనిపించుకుంటుంది. ఏది ఏమైన మూవీ ఎలా ఉంది అనేది తెలియాలంటే మీరు కూడా థియేటర్లకు వెళ్లి చూడాల్సిందే.

Also Read.. ఆ పార్ట్‌కు సర్జరీ చేయించుకున్న నిధి అగర్వాల్..! అవసరమా అంటున్న నెటిజన్లు

Bichagadu 2: ప్రపంచవ్యాప్తంగా బిచ్చగాడు 2 ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

ఆ విషయం నిర్మాతలకు తెలిస్తే నాకు పని ఇవ్వరు: స్టార్ హీరో

Next Story