అడివి శేష్ సింగిల్ కాదు చాలా మంది అమ్మాయిలతో ఎఫైర్ ఉందంటూ.. అసలు విషయం బయటపెట్టిన డైరెక్టర్!

by Disha Web Desk 6 |
అడివి శేష్ సింగిల్ కాదు చాలా మంది అమ్మాయిలతో ఎఫైర్ ఉందంటూ.. అసలు విషయం బయటపెట్టిన డైరెక్టర్!
X

దిశ, సినిమా: యంగ్ హీరో అడివి శేష్ 2010 లో రిలీజ్ అయిన కర్మ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి మెప్పించాడు. ముఖ్యంగా హిట్, గూఢచారి, మేజర్ వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకోవడంతో ఆయన క్రేజ్ పెరిగిపోయింది. ప్రస్తుతం అడివి శేష్ మంచి కథలు ఎంచుకుంటూ కెరీర్ పరంగా దూసుకెళ్తున్నాడు. తాజాగా, అడివి శేష్, డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్‌తో కలిసి నిహారిక చెఫ్ మంత్రా షోకు హాజరయ్యారు దీనికి సంబంధించిన ప్రోమో వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ముందుగా వీరిద్దరికి నిహారిక వెల్‌కమ్ చెప్పడంతో పాటు వారితో కలిసి డాన్స్ కూడా చేస్తుంది. ఆ తర్వాత మెగా డాటర్ 8 దాటి 9 ఎంటర్ కాబోతున్నావ్.. ఇప్పటికీ ఒంటరిగానే మిలిగిపోయావు. నీకు లైన్ వేసుకోవచ్చా.. అని అడివి శేష్‌ను అడుగుతుంది. అప్పుడు రాహుల్ అదేంటని షాక్ అవుతూ.. అతను సింగిల్ కాదు.. మల్టిపుల్. ఇప్పటికే అతనికి చాలా మంది అమ్మాయిలతో ఎఫైర్స్ ఉన్నాయని ఫన్నీ కామెంట్స్ చేస్తాడు. దీంతో నిహారిక, అడివి శేష్ నవ్వుతారు. ఇక ఇందులో పలు గేమ్స్ ఆడటంతో పాటుగా అడివి శేష్, రాహుల్ వంట కూడా చేస్తారు. ప్రస్తుతం ఈ ప్రోమోలో రాహుల్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ కావడంతో ఈ విషయం తెలిసిన నెటిజన్లు రకరకాలుగా చర్చించుకుంటున్నారు.


Next Story

Most Viewed