పెళ్లైన రెండేళ్లకే భర్తతో నటి మహాలక్ష్మి విడాకులు.. అలాంటి పోస్ట్‌‌తో క్లారిటీ ఇచ్చిన రవీందర్!

by Disha Web Desk 6 |
పెళ్లైన రెండేళ్లకే భర్తతో నటి మహాలక్ష్మి విడాకులు.. అలాంటి పోస్ట్‌‌తో క్లారిటీ ఇచ్చిన రవీందర్!
X

దిశ, సినిమా: తమిళ నటి మహాలక్ష్మి, నిర్మాత రవీందర్ చంద్రశేఖర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మహాలక్ష్మికి పెళ్లై ఓ కొడుకు ఉన్నప్పటికీ మొదటి భర్తతో విడాకులు తీసుకుని రవీందర్‌ను రెండో పెళ్లి చేసుకుని సెన్సేషన్ క్రియేట్ చేసింది. వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోల్లో రవీందర్ బాగా లావుగా ఉండటం వల్ల అవి చూసిన నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేశారు. డబ్బు కోసమే చేసుకుందని కొద్ది కాలం పాటు ఆమెపై నెట్టింట చర్చలు జరిపారు. అయినప్పటికీ మహాలక్ష్మి స్పందించకుండా తన భర్తతో ఫుల్ ఎంజాయ్ చేసింది.

ఈ క్రమంలోనే రవీందర్ ఓ కేసులో అరెస్ట్ కావడంతో అంతా ఈ జంటను ఆడేసుకున్నారు. అయినా మహాలక్ష్మి మాత్రం తన భర్తకు సపోర్ట్‌గా ఉంది. తనపై ఉన్న ప్రేమను నిత్యం సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే వీరిద్దరి మధ్య గత కొద్ది కాలంగా విభేదాలు వస్తున్నాయని త్వరలో విడిపోతారని నెట్టింట వార్తలు వైరల్ అయ్యాయి. వాటిపై స్పందించిన మహాలక్ష్మి అందులో నిజం లేదని పుకార్లను కొట్టిపారేసింది.

తాజాగా, మహాలక్ష్మి భర్త రవీందర్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ పెట్టడంతో మళ్లీ విడాకుల వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అయితే రవీందర్ తన ఫొటో షేర్ చేసి ‘‘నాలో నేను ఏదో మిస్ అయ్యాను’’ అని రాసుకొచ్చాడు. దీంతో అది చూసిన నెటిజన్లు మహాలక్ష్మికి దూరంగా రవీందర్ ఉంటున్నారనే అనుమానాలు వస్తున్నాయి. అయితే మహాలక్ష్మి-రవీందర్ విడాకులు వార్తల్లో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ విషయం తెలిసిన వారంతా షాక్ అవుతున్నారు.

Next Story

Most Viewed