'బింబిసార' మాదిరిగానే మెప్పించనున్న 'సువర్ణ సుందరి'

by Prasanna |
బింబిసార మాదిరిగానే మెప్పించనున్న సువర్ణ సుందరి
X

దిశ, సినిమా : సీనియర్ నటి జయప్రద, పూర్ణ, సాక్షి చౌదరి ప్రధానపాత్రల్లో నటిస్తున్న చిత్రం 'సువర్ణ సుందరి'. డాక్టర్ ఎమ్‌వికె రెడ్డి సమర్పణలో ఎస్ టీమ్ పిక్చర్స్ పతాకం ఎమ్.ఎల్. లక్ష్మీ నిర్మించిన చిత్రానికి సురేంద్ర మాదారపు దర్శకులు కాగా.. కరోనా కారణంగా వాయిదా పడిన సినిమాను ఫిబ్రవరి 3న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. మినిట్ టు మినిట్ థ్రిల్లింగ్ అందించే మూవీ విడుదలకు ఇదే కరెక్ట్ టైమ్ అని అభిప్రాయపడ్డాడు దర్శకుడు. సినీ సర్కార్ ఎంటర్టైన్మెంట్స్ వీరబాబు 'సువర్ణ సుందరి'నా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు తెలిపిన ఆయన.. బింబిసార, కార్తికేయ -2, మసూద జోనర్‌లోనే ఉన్న తమ సినిమాను ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారనే నమ్మకం ఉందన్నాడు.

ఇవి కూడా చదవండి : ఆ మాటలు నన్ను మానసికంగా వేధిస్తున్నాయి : Rashmika Mandanna

Next Story

Most Viewed