మీకొక చల్లటి కబురు

by  |
మీకొక చల్లటి కబురు
X

దిశ, వెబ్ డెస్క్: వారం రోజుల పాటు ఆలస్యం కావచ్చిన ఇటీవల ప్రకటించినా మారిన వాతావరణ పరిస్థితుల్లో ఈసారి కాస్త ముందుగానే వస్తాయని స్పష్టం చేసింది. కేరళను తాకడానికి ముందు మాల్దీవుల్లోని కొన్ని ప్రాంతాలు, బంగాళాఖాతంలోని దక్షిణ భాగం, అండమాన్ సముద్రంతో పాటు నికోబార్ దీవుల్లోనూ రుతుపవనాలు ప్రభావం చూపుతాయని పేర్కొంది. రానున్న 48 గంటల్లో రుతుపవనాల ప్రభావాన్ని గ్రహించవచ్చని బులెటిన్ లో పేర్కొంది. అరేబియా సముద్రంలో ఆదివారం తర్వాత అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, కేరళను తాకడానికి దోహదపడనున్నాయని తెలిపింది. అల్పపీడనం కారణంగా కేరళలోని మాహె తదితర ప్రాంతాలతోపాటు లక్షద్వీపాల్లో కూడా వర్షం కురిసినట్లు పేర్కొంది. గంటకు 50 కి.మీ. ల వేగంతో తీర ప్రాంతంలో గాలులు వీస్తాయని, దీని ప్రభావం రానున్న 48 గంటల్లో తిరువనంతపురంతోపాటు కొల్లం, పథనంతిట్ట, ఆలప్పుళ, కోట్టయం, ఇడుక్కి, ఎర్నాకులం, త్రిచూర్, పాలక్కాడు, మలప్పురం, కోళికోడ్, వేనాడు, కన్నూరు, కాసర్ గోడ్ ప్రాంతాల్లో ఉంటుందని తెలిపారు. ఇప్పటికే అరేబియా సముద్రంలో పశ్చిమ మధ్య భాగంలో మరో అల్పపీడనం ఏర్పడిందని, ఇది వాయుగుండంగా మారి రానున్న 48 గంటల్లో వాయువ్య దిశగా ప్రయాణించి ఒమన్-ఎమెన్ సమీపంలో తీరం దాటనుందని పేర్కొంది. మరోవైపు కేరళలోని పశ్చిమ తీర ప్రాంతంలో శనివారం సాయంత్రం నుంచే వాతావరణం చల్లబడిందని, భారత వాతావరణ శాఖ అంచనాకంటే కొన్ని గంటల ముందే వాతావరణ పరిస్థితుల్లో మార్పు వచ్చిందని ప్రైవేట్ సంస్థ స్కైమెట్ పేర్కొంది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story