ఆర్బీఐ నిర్ణయాలతో పేదలకు ఊరట : మోడీ

by  |
ఆర్బీఐ నిర్ణయాలతో పేదలకు ఊరట : మోడీ
X

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ.. ఆర్బీఐ నిర్ణయాలను సమర్థిస్తూ ట్వీట్ చేశారు. లాక్‌డౌన్ కాలంలో ఆర్బీఐ చేసిన ప్రకటన.. రుణ సదుపాయానికి, నగదు లభ్యతకు దోహదపడుతుందని పేర్కొన్నారు. కేంద్రీయ బ్యాంకు నిర్ణయాలు పేదలు, రైతులకు ఉపయోగకరంగా ఉన్నాయని తెలిపారు. చిన్న పరిశ్రమలు, ఎంఎస్ఎంఈ సంస్థలకూ ప్రయోజనాలను చేకూరుస్తాయని వివరించారు. అంతేకాదు, రాష్ట్రాలకు రుణసదుపాయాలను మెరుగుపరుస్తుందని ట్వీట్ చేశారు.

ప్రధాని నరేంద్ర మోడీ లాక్‌డౌన్‌ను వచ్చే నెల 3వ తేదీ వరకు పొడిగిస్తూ ప్రకటించినా.. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఈ నెల 20వ తేదీ నుంచి కొన్ని మినహాయింపులనిచ్చిన విషయం తెలిసిందే. కాగా, కొవిడ్ 19పై పోరుకు ఆర్బీఐ తాజాగా రెండో ప్యాకేజీని ప్రకటించింది. బ్యాంకు రుణాలను మెరుగుపరిచేందుకు డిపాజిట్ రేట్లకు కోత విధించిన కొద్దిసేపటికే ఈ ప్రకటన వెలువరించింది.

Tags: covid 19 package, rbi, central bank, modi, tweet, support

Next Story

Most Viewed