ప్రతి గింజకు గిట్టుబాటు ధర చెల్లిస్తాం..జేసీ మాధవీలత!

by  |
ప్రతి గింజకు గిట్టుబాటు ధర చెల్లిస్తాం..జేసీ మాధవీలత!
X

దిశ, విజయవాడ: నగరంలోని రెడ్ జోన్లున్న ఆరు ప్రాంతాల్లో మొబైల్ బజార్లను ఏర్పాటు చేశామని జాయింట్ కలెక్టర్ కె.మాధవీలత తెలిపారు. ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆమె..లాక్‌డౌన్ వల్ల ప్రజలు ఇబ్బంది పడకుండా ఇంటికే నిత్యావసరాలను పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. నగరంలో మొత్తం 108 మొబైల్, 25 రైతు బజార్లు అందుబాటులో ఉంటాయని, మూడో విడత ఉచిత రేషన్ పంపిణీ కొనసాతోందని, పేదలందరికీ సరుకులు అందజేస్తున్నట్టు వివరించారు. అలాగే, రేషన్ డీలర్లకు ఒక్కొక్కరికీ 5 మాస్కులు, 5 శానిటైజర్లు, 5 హ్యాండ్ గ్లౌసులు, కరొనా నియంత్రణ కోసం టైమ్ స్లాట్ కూపనలను ఇచ్చినట్టు తెలిపారు.

లాక్‌డౌన్ కారణంగా రైతులు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తోందని స్పష్టం చేశారు. జిల్లాలో మొత్తం 5 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారని, రబీలో పంట దిగుబడులు కూడా బాగా వచ్చాయని చెప్పారు. జిల్లా మొత్తంలో 267 ధాన్యం కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు..ఇప్పటిదాకా లక్ష టన్నుల ధాన్యం కొనుగోలు చేసిన చెప్పారు. ప్రతి ధాన్యం గింజకు గిట్టుబాటు ధర ఇచ్చి కొనుగోలు చేయనున్నట్టు, కరోనా పేరుతో దోపిడి చేసే దళారులను నమ్మొద్దని జేసీ కె.మాధవీలత రైతులకు విజ్ఞప్తి చేశారు.

Tags: mobile market, raitu bazar, vijayawada, jount collecter

Next Story

Most Viewed