వైర్‌లెస్ ఛార్జింగ్.. ఈ కారు స్పెషల్

by  |
Car-special-5
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా మార్కెట్లోకి తన ఎక్స్‌యూవీ 700 మోడల్‌లో రెండు కొత్త లగ్జరీ వేరియంట్లను మంగళవారం విడుదల చేసింది. డీజిల్ ఇంజిన్‌తో అందుబాటులోకి వచ్చిన వీటి ధర రూ. 19.99 లక్షల నుంచి రూ. 22.89 లక్షల మధ్య నిర్ణయించినట్టు కంపెనీ వెల్లడించింది. అక్టోబర్ 7 నుంచి ప్రారంభమయ్యే ఈ ధరలు మొదటగా బుక్ చేసుకున్న 25 వేల మంది వినియోగదారులకు మాత్రమే వర్తిస్తాయని మహీంద్రా సంస్థ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. ఏఎక్స్7 లగ్జరీ ఎంటీ, ఏఎక్7 లగ్జరీ ఏటీ ప్లస్ ఏడబ్ల్యూడీ పేర్లతో తీసుకొచ్చిన వేరియంట్లు ఆటోమెటిక్ ట్రాన్స్‌మిషన్, మాన్యూవల్ ట్రాన్స్‌మిషన్లుగా పనిచేస్తాయని కంపెనీ తెలిపింది. ఈ రెండూ కూడా 7-సీటర్ సామర్థ్యం, డీజిల్ ఇంజిన్‌తో అందుబాటులో ఉండనున్నట్టు కంపెనీ పేర్కొంది. ఇప్పటికే విడుదలైన ఏఎక్స్7 వేరియంట్‌కు అదనంగా ఏఎక్స్7 లగ్జరీ వేరియంట్లో కొన్ని ఫీచర్లను అందించినట్టు కంపెనీ తెలిపింది. 3డీ సౌండ్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, వైర్‌లెస్ ఛార్జింగ్, 360 డిగ్రీల సరౌండ్ వ్యూతో పాటు అత్యాధునిక ఫీచర్లను అందించినట్టు పేర్కొంది. అలాగే, ఆటోమొబైల్ కంపెనీల్లోనె మొదటిసారిగా వెబ్‌సైట్‌లో యాడ్-టూ-కార్ట్ అనే సౌకర్యాన్ని తీసుకొచ్చామని కంపెనీ వివరించింది. అంతేకాకుండా ఈ మోడల్‌లోని ఇంజిన్ విధానం, కలర్, సీటింగ్ సామర్థ్యం లాంటి పలు ఎంపిక చేసిన వాటిని వినియోగదారులకు తగినట్టు కస్టమైజ్ చేసుకునే వెసులుబాటు కూడా ఉందని కంపెనీ వెల్లడించింది.



Next Story

Most Viewed